ప్రజా భారత ఐతిహాసికుడు ఒక సహస్రాబ్ది దార్శనిక కవి శేషేంద్ర పునఃసంస్మరణ కవిత్వానికి తక్షణ ప్రయోజనం, కవిత్వాన్ని విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొంది వ్వాప్ అనడం, భోజనం తిని గుర్రున త్రేన్చినట్టు. అయితే తిన్న ఆన్నం జీర్ణమై శరీరాన్ని, మెదడును నడిపే ఇంధనమై రక్తప్రవాల్లోకి ప్రవేశించి, నఖశిఖ పర్యంతం వేలాది రక్తనాళాల్లో ప్రవహిస్తూ క్రమంగా మనిషిని శారీరకంగా మానసికంగా బలిష్టుణ్ణి ఎలా చేస్తుందో ఎలా సజీవునిగా నిలబెడుందో అలాగే కవిత్వం శ్రవణంచేత ప్రభావితుడౌతాడు. అలంకార బింబ ప్రతీకలు శ్రవణేంద్రియాల ద్వారా మనిషిలోని రక్తంలోకి ప్రవేశించి అనదుల్లో కరిగిపోయి సమస్త శరీరవ్యాప్తమౌతాయి. రక్తనిష్టమౌతాయి. అలా ఒక తరం మానవుల్లో రక్తనిషమైన అలంకార బింబ ప్రతీకలు తదనంతర తరానికి జన్యుకణాల ద్వారా సంక్రమింపజేయబడతాయి. అలా తరతరాలు రక్తనిష్టంగా సంక్రమింపజేయబడి, అవి మనిషి ఆలోచనల్నీ, అలవాట్లనీ, చర్యల్నీ, స్వభావాన్సీ రూపాయితం చేస్తాయి. ఒక దేశపు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఆ దేశపు ప్రజలకు ఇదే చేశాయి. ఆ పార్యంతిక ఫలాల్నే ఆ దేశపు సంస్కృతి అనీ, నాగరకత అనీ అంటారు. ఈ రెంటికీ కవులే జనకులు. ఇదే కవిత్వం కలిగించే శాశ్వత ప్రయోజనం. | శేషేంద్ర, కవిసేన మానిఫెస్టో, నేటి కవిత్వం - వివిధ దృక్పథాలు- ఆగస్ట్, 1994).
1977 లో ప్రథమ ముద్రణగా వెలువడ్డ ఆధునిక కావ్యశాస్త్రం 'కవిసేన మానిఫెస్టోను వెలువరిస్తూ శేషేంద్ర 'అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిన పరిస్థితుల్లో ఆవిర్భవించిన | ఒక కవితోద్యమ పత్రమనీ' మానిఫెస్టోను అభివర్ణిస్తూ... ప్రాచీన ప్రాక్ పశ్చిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్ట్ కావ్యతత్త్వ చింతన, అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్యజనక అభిన్నతనూ, ఐకమత్యాన్ని...............