ఉపోద్ఘాతము
మీ మనోకారాగారాల్ని తెరవండి
ప్రాణాపాయ శిబిరంలో ఎలాబతకాలో నేర్చుకున్నాను
అది 1944వ సంవత్సరం అప్పుడు నాకు పదహారేళ్లు.. మా అమ్మానాన్న, ఇద్దరు అక్కలతో కలిసి నేను హంగరీలోని కాసా నగరంలో ఉండేదాన్ని... చుట్టూ అంతా యుద్ధ వాతావరణం ఉండేది... భయం, ద్వేషం వివక్షతో కూడిన పరిస్థితులు ఎల్లెడలా తాండవించేవి... మేం ధరించిన కోట్లకు... పసుపు పచ్చ నక్షత్రం బిళ్లల్ని పిన్చేసి ఉండేవి. హంగరీలోని నాజీ మద్దతుదారుల్ని నియిలాలు అనిపిలిచేవారు. మేం నివసించిన పాత అపార్ట్మెంట్లోనే ఆక్రమించుకుని ఉండేవాళ్లు. ఐరోపా అంతటా జర్మనీ ప్రాబల్యం విస్తరించటం గురించీ, యుద్ధ భూమి గురించి వార్తా పత్రికల నిండా నిండిన కథనాలు మాకు భయం కల్గించేవి. మా ఇంట్లో ఉన్న టేబుల్ దగ్గర బిక్కు బిక్కుమంటూ బిత్తరచూపులు చూస్తున్న నా తల్లిదండ్రులు. ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్లో పాల్గొనాలన్న నా ఆశ అడియాశే అయ్యింది. నేను యూదు మతానికి చెందిన దాన్ని కావడంతో ఆ ఆట బృందంలో నుంచి నా పేరు తొలిగించేశారు. చెప్పాలంటే ఆ రోజు చాలా దారుణమైన రోజే నా జీవితంలో... కాకపోతే టీనేజ్లో ఉండే ఇతర వ్యాపకాల్లో పడి నేను దాన్ని మర్చిపోయాననే చెప్పాలి. నా మొదటి బాయ్ ఫ్రెండ్ ఎరిక్తోతో ప్రేమలో పడ్డాను.. అతను చాలా పొడుగ్గా ఉండేవాడు. పుస్తకాల క్లబ్లో కలిశాడు. నేను మొదటిసారిగా పెట్టిన ముద్దునే మళ్లీ పెట్టాను... మా నాన్న నా కోసం కుట్టి ఇచ్చిన కొత్త నీలంరంగు సిల్క్ డ్రెస్ ధరించి ఉన్నాను. నేను అభ్యాసం చేస్తున్న నృత్య................