• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kadupatram

Kadupatram By Tavva Obul Reddy

₹ 150

నవ వసంతం
 

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి

కేక వేసినాడు.

“గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా" అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి.

“అబ్బెబ్బే... అదేం లేదులేబ్బా... నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.

“ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడమంటే మాటలా!?" తన సంజాయిషీకి కొనసాగింపుగా మనసులో అనుకున్నాడు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా గడ్డం గీస్తున్న గంగులయ్య ఒకటికి పదిసార్లు కత్తిని కరుకు రాతిపై నూరు కుంటున్నాడు.

"ఒరేయ్! గంగులూ గడ్డం మింద ఒకసారి గీకడానికి కత్తిని నూరుసార్లు నూరుతాండవ్ ఏందిరా?” అసహనంగా గద్దించినాడు. విజయరాఘవరెడ్డి.

ఏం మాట్లాడితే ఏం బరువో అన్నట్లుగా తలగీరుకుంటూ మౌనంగా నేలపైకి చూపు తిప్పినాడు గంగులయ్య. ఐదేళ్ల కిందట ఊళ్లో గలాట పడినప్పుడు ఒకేసారి నలుగురిని నరికించిన విజయరాఘవరెడ్డి ఉగ్రరూపం గుర్తుకు వచ్చింది గంగులయ్యకు. “ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడమంటే మాటలా?" మళ్ళీ మనసులో అనుకున్నాడు గంగులయ్య.

“ఊళ్లో పిల్లనాళ్లు ఏందిరా... అట్ట కేకలేచ్చా పరిగెత్తాండారు?” గంగులయ్యను ప్రశ్నించినాడు విజయరాఘవరెడ్డి..............

  • Title :Kadupatram
  • Author :Tavva Obul Reddy
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN4490
  • Binding :Papar back
  • Published Date :May, 2023
  • Number Of Pages :154
  • Language :Telugu
  • Availability :instock