• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kailasa Nagaram

Kailasa Nagaram By Syambabu

₹ 200

కైలాస నగరం

డార్జిలింగ్ స్టేషన్లో రైలు ఆగేప్పటికి రాత్రి ఎనిమిదయ్యింది. సన్నని ఈదురు గాలితోపాటు జోరుగా వాన పడుతోంది.

కంపార్టుమెంట్లోనే సూట్కేస్ తెరచి రెయిన్కోటు బయటికి తీశాను. స్టేషనుకు కారు తీసుకురమ్మని కలకత్తాలో బయలుదేరేముందు నా నౌకరు బిమాన్కు టెలిగ్రామ్ ఇచ్చాను.

వర్షం వలన చాలా చలిగా వుంది. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో వుండడం వలన వేసవిలోనే అతి చల్లగా వుంటుంది డార్జిలింగ్. ఇక వర్షాకాలంలోనూ, శీతాకాలంలోనూ చెప్పక్కరలేదు. వులెన్ హుడెడ్ టోపీని చెవులమీదకు లాక్కొని ప్లాట్ఫారం మీదకు దిగాను.

ఎక్కడా బిమాన్ జాడలు తెలియడం లేదు. నా టెలిగ్రాం అందిందో లేదో... వర్షా కాలంలో తరచు టెలిగ్రాఫ్ స్తంభాలు పడిపోయి లైన్లు పాడయిపోతూ వుంటాయి. బహుశా అంది వుండదు. అందివుంటే తప్పక స్టేషన్కు వచ్చి వుండేవాడే... యిప్పుడిక ఏ టాక్సీలోనో వెళ్ళాలి ఇంటికి

స్టేషన్ బయట ఒకే ఒక టాక్సీ వుంటి. పోర్టరు సూట్కేసు ముందుసీట్లో పెట్టాడు. నేను సిగరెట్టు పారేసి లోపల కూర్చున్నాను. టాక్సీ రయ్యిన డార్జిలింగ్ వీధుల్లో నుండి దూసుకుపోసాగింది. క్రెయిటన్ పాయింట్ చేరుకొనేప్పటికి వర్షం తగ్గిపోయింది. సన్నగా తుంపర పడుతోంది.

ఇంటిముందు టాక్సీ దిగి డబ్బు చెల్లించాను. టాక్సీవాడు చిన్న సలాంచేసి టాక్సీ తిప్పుకొని వెళ్ళిపోయాడు.

క్రెయిటన్ పాయింట్ చివరి ఇల్లు నాదే. ఎప్పుడో దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం మా తాతగారు కట్టించినది. మా ఇంటికి కాస్త అవతలికి రోడ్డు ఆగిపోతుంది. అవతలి లోయలోకి ఎవరూ ప్రమాదవశాత్తు వెళ్ళకుండా ఆరడుగుల ఎత్తున బలమైన కాంక్రీటుగోడ నిర్మించారు.

కొండ అంచున అన్ని వాతావరణాలకు తట్టుకొనేట్లు కట్టిన ఇల్లది. కట్టడంలో పురాతన బ్రిటిష్ నిర్మాణ పద్ధతి స్పష్టంగా కనిపిస్తోంది. పోర్టికోలోని ఎలక్ట్రిక్ దీపం చెట్ల ఆకులమీద పడి చిత్రంగా మెరుస్తోంది. గాలికి పొడవాటి ఆ చెట్లు అటూ ఇటూ వూగుతున్నాయ్......................

  • Title :Kailasa Nagaram
  • Author :Syambabu
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN4584
  • Binding :Paerback
  • Published Date :2023
  • Number Of Pages :210
  • Language :Telugu
  • Availability :instock