ఉక్రెయిన్లో షెటోవ్కా అనే పట్టణం. ఆరు రైలుమార్గాలు కలిసే అతి కీలకమైన జంక్షన్ జంక్షన్లో ఇరవై నాలుగు గంటలూ రద్దీగా వుండే హెూటల్. ఒక రోజు... ఒక తల్లి తన కొడుకుని తీసుకువచ్చి -
"అయ్యా! మా పిల్లగాడికి ఏదైనా పని వుంటే ఇప్పించండి.”
యజమాని ఎగాదిగా చూచి..
“వయసెంత?”
పన్నెండు”
"సరే. నెలకి ఎనిమిది రూబుళ్ల జీతం. పనిలోకి వచ్చినరోజే తిండి. రోజు విడిచి రోజు రాత్రీ పగలూ పని చేయాలి. వీడికి చేతివాటం ఏమైనా వుందా?”
"లేదయ్యా! దానికి నాదీ పూచీ.”
"సరే. ఏయ్ జినా! ఇటురా! ఈ కుర్రాణ్ణి వంటింట్లోకి తీసుకు పోయి ఫ్రోశ్యాకు అప్పచెప్పు." జినా ఆ పిల్లవాడిని తీసుకుని బయలు దేరింది. వాడి తల్లి పిల్లవాడివెంట లోనకంటా వెళ్లింది.
"నాయనా పావుష్కా ! ఒళ్ళు దాచుకోకు. మంచి పనివాడివి అనిపించుకో” అని చెప్పి పంపించింది. సరేనని తలూపి పావెల్ వంటగది నేలమాళిగలోకి జినా వెంట దిగాడు. బడిలోంచి వెళ్లగొట్టిన తర్వాత పావెల్ కోర్చాగిన్ ను ఈ రైల్వే హెూటల్లో పనివాడిగా చేర్పించింది వాళ్ళ అమ్మ. తెలివైనవాడూ, పట్టుదల కలవాడూ అయిన పావెల్ ను బడి నుంచి వెళ్లగొట్టడం వెనుక ఒక కథే వుంది.
ఓ రోజు పావెల్, మిష్కాలెవ్ చుకోవూ దెబ్బలాడుకున్నారు. పనిష్మెంట్గా పావెన్ను పాఠాలయిపోయిన తర్వాత కూడా ఇంటికి పోనివ్వలేదు. ఒంటరిగా తరగతి గదిలో వదిలేస్తే అల్లరి చేస్తాడేమోనని పావెల్న మాష్టారు తనతోపాటు రెండవ తరగతికి తీసుకువెళ్ళాడు. రెండవ తరగతిలో -సైన్స్ మాస్టారు వచ్చి భూమి గుండ్రంగా ఉందని, అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పారు. భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. అది వింటుంటే పావెల్క ఆశ్చర్యం వేసింది. బైబిల్లో అలా చెప్పలేదే అనేసేవాడే కానీ మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారని ఫాదర్ వాసిలీ పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు 2వ తరగతి క్లాసులో సైన్సు మాష్టారు చెప్పిన విషయం అడగబోయాడు. పావెల్ కు బైబిల్ కొత్త, పాత నిబంధనలు రెండూ కొట్టిన పిండి. బైబిల్ ప్రకారం భూమి పుట్టి ఐదువేల ....................