• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kakatiyula Shasanalalo Chando Vaividhyam

Kakatiyula Shasanalalo Chando Vaividhyam By Dr Lagadapati Sangaiah , Dr Mamidi Harikrishna

₹ 600

లోతైన పరిశోధన

తెలుగు సారస్వతం ఒక సుందరమైన ఉద్యానవనం. ఉద్యానవనంలో ఎలా వివిధ దేశీ పద్యాలు రకాలైన పుష్పములుంటాయో తెలుగు కావ్యాలలోను అనేక రకాలైన వృత్తాలు, వివిధ గతులతో సంచరిస్తూ కానవస్తున్నవి. రాయప్రోలు సుబ్బారావుగారు అందుకే 'తెలుగు తోట' అని ఒక కావ్యానికి నామకరణం చేశారు. సంస్కృతంలో అనంతమైన ఛందో నిర్మాణమున్నది. వృత్త రత్నాకరము, పింగళఛందము మొదలైన లక్షణ గ్రంథాలు వేలాది పద్య రూపాలను ప్రస్తావించడం జరిగింది. ఈ వృత్తాలలో ఈ ఛందస్సులను సంస్కృతం తర్వాత కన్నడంలో కొంతకాలం ఉపయోగించడం మనకు కానవస్తుంది. తమిళంలో పద్యనిర్మాణంలో ప్రాసనిష్ట ఉన్నది. మిగిలిన భాషా సారస్వతాలలో అక్షర నియత గణాలున్న రచనలు అరుదుగానే ఉండవచ్చు. గానయోగ్యములైన మాత్రాగణసృష్టి వీటన్నింటిలో ప్రధానం. తెలుగులో సంస్కృతంలోని వృత్తములలో దేశీయములైన సూర్యేంద్రగణాదులు కలిగిన పద్యాలు ఉన్నాయి. సూర్యేంద్రగణాల వత్తిడివల్ల పద్యానికి అక్షరగణబద్దమైన పద్యానికి కూడా గేయయోగ్యత సంభవించింది.

ఉత్పల చంపకమాలలు మత్తేభము సంస్కృత ఛందస్సులే అయినా సంస్కృత సారస్వతంలో ప్రయోగం విరళంగానే కనిపిస్తుంది. అందువల్ల తెలుగు కావ్య సారస్వతం బహుఛందస్సుల ఉపయోగం వలన సంకలనం వలన అనంతమైన వైవిధ్యాన్ని సంతరించుకున్నది. నన్నయ భారతానికి ముందే తెలుగులో కొంత సారస్వతం ఉన్నదనడానికి మన అనేకమైన శాసనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. నన్నయకు పూర్వ శాసనాలలో విరియాల కామసాని శాసనంలో ఉత్పలమాలలు అనే అక్షరగణ ఛందస్సులు, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కరలనే దేశీయఛందస్సులు కనిపిస్తున్నవి.

ఈ రకమైన మార్గ, దేశి ఛందస్సుల ప్రచారం ఉన్నట్లు నన్నయకు ముందే 300 సంవత్సరాలకుముందు రచనా వ్యాసంగం సాగుతున్నట్లుగా మనకు శాసనాలు సాక్ష్యం ఇస్తున్నవి. అంటే తెలుగు కావ్యాల వయస్సు 1300 సంవత్సరాలకు పైగానే ఉన్నట్లుగా నిరూపితమవుతున్నది.................

15

  • Title :Kakatiyula Shasanalalo Chando Vaividhyam
  • Author :Dr Lagadapati Sangaiah , Dr Mamidi Harikrishna
  • Publisher :Dr Mamidi Harikrishna
  • ISBN :MANIMN4628
  • Binding :Paerback
  • Published Date :July, 2023
  • Number Of Pages :834
  • Language :Telugu
  • Availability :instock