ఉదయకాంతులు
వందేమాతరం! లాల్, బాల్, పాల్! నందనందన యోరే మధ్యే హూణరాజ్యమ్ వినశ్యతి
నినాదాలతో దేశమంతా మార్మోగింది. ఏదో మార్పు వస్తుందన్న ఉత్సుకత ప్రజలలో తొంగిచూసింది. స్వాతంత్ర్యం కోసం ఏదైనా చేయాలన్న తెగువ అందరిలో కన్పించింది. 1905లో జరిగిన బెంగాల్ విభజనతో ప్రారంభమైన ఉద్యమం, బ్రిటిష్ వారిని తరిమివేసే వరకూ కొనసాగింది. ప్రథమ స్వాతంత్ర్య పోరాటపు(1857) స్వర్ణోత్సవాలు దేశమంతటా జరుగుతున్నాయి. హూణుల పెత్తనం అంతరించిపోనున్నదని పంచాంగ వేత్తలు, 'జ్యోతిషశాస్త్రజ్ఞులు భవిష్యత్ దర్శనం చేస్తున్నారు. స్వరాజ్య సాధనయే లక్ష్యంగా జాతి ఏకోన్ముఖమై కదిలింది.
భారతమాతను శ్లాఘిస్తూ బంకించంద్రుడు తన ఆనందమఠం నవలలో వ్రాసిన వందేమాతర గీతం, నాటి పోరాటానికి శంఖారావంగా మారింది. మఠంలో తిరుగుబాటు చేసిన సాధువుల గొంతులలో పలికిన యీ పాట జాతిజనులు పఠించే మంత్రంగా మారింది. బానిసత్వభావాలను తరిమేసి, ప్రజలంతా జాతీయోద్యమ బాటలో నడిచారు.
లాల్-పాల్-బాల్ త్రయంలో బాలగంగాధర్ తిలకొని ముందుగా స్మరించుకోవాలి. ప్రభుత్వము క్రూర, నిరంకుశధోరణి ఆయనను అణచలేకపోయింది. చెరసాలల నిర్బంధం ఆయనను అడ్డుకోలేకపోయింది. ప్రజ్వరిల్లే మహారాష్ట్ర తేజానికి ఆయన ప్రతీకగా నిలిచాడు. తన కలం విదిలింపులతో, ఆలోచనల పదునుతో ఉద్యమానికి జవసత్వాలు కూర్చిన మేదావిగా, బిపిన్ చంద్రపాల్ నాయకత్వ పటిమను చాటారు. వ్యవసాయదారుల పకాన నిలబడి పోరాడిన ఉద్యమ నిర్మాతగా, పంజాబ్ ప్రజల ప్రియతమ.............