• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kalaprapancham

Kalaprapancham By L R Venkata Ramana

₹ 250

ఆధునిక భారతీయ చిత్రకళకు ఆధ్యుడు అవనీంద్రుడు

"వంగ దేశంలో ఠాకూర్ పరివారం వెనుకటి నుండీ భారత సంస్కృతికి జీవనదిగా ప్రవహిస్తూ వస్తున్నది. అందులో ప్రత్యేకం శిల్పాలకు పుట్టినిల్లు వీరి పరివారం. ధార్మిక విషయాల్లో దేవేంద్రనాథ ఠాకూరు నవ్య భావోదయాన్ని కలిగించితే, ఆయన కొడుకు రవీంద్రుడు సాహిత్య రంగంలో నవకాంతులను వెదజల్లాడు. అదే విధంగా శిల్ప రంగంలో అవనీంద్రుడు కూడ" అంటారు సంజీవదేవ్ గారు.

బెంగాలీవారు అభనీంద్రనాథ ఠాకూర్ అని పిలుచుకుంటారు. ఇతను ఆధునిక భారతీయ చిత్రకళకు ఆద్యుడు. భారతీయ చిత్రకళా చరిత్రలో విప్లవాన్ని తెచ్చినవాడు. ఇతడు 1871 ఆగస్టు 7న కలకత్తాలోని "జొరశంకో"లో జన్మించాడు. ఇతని తండ్రి గణేంద్రనాథ ఠాకూరు. తాత గిరీంద్రనాథ ఠాకూరు. ఆకాలంలోనే గిరీంద్రుడు మానవ రూపాలను, ప్రకృతి దృశ్యాలను యూరోపియన్ శైలిలో చిత్రిస్తుండేవాడు.

అభయేంద్ర నాథ ఠాకూర్ శిష్యుడైన ముకలే Abayandranath Tagore Survey of the Master Life and work" అన్న వ్యాసం రాశాడు దీన్ని విశ్వభారతి క్వార్టర్లీ (మే- అక్టోబర్, 1942) లో ప్రచురించారు. అభయేంద్రుని గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఇదొక చక్కని ఆధారం.

బాల అభనీంద్రుడు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉచ్ఛరిస్తున్న పదాన్ని తప్పుగా సూచించాడు దానికి కోపంతో ఆ పంతులుగారు బాల అభనీంద్రుని చితకబాదాడు అంతే అదే పాఠశాలకు వెళ్ళడం చివరిరోజు అయింది.

అభనీంద్రుని తండ్రి ఆర్కిటెక్ట్ స్కెచెస్ గీస్తుండేవాడు. ఆ రంగుల పెన్సిల్స్ అభనీంద్రునిలోని కళాకారుని తట్టి లేపాయి. బాల అభనీంద్రుడు ఆ రంగుల పెన్సిల్తో ఎన్నో ప్రకృతి దృశ్యాలను గీచాడు. బాల అభన్ గీస్తున్న చిత్రాలను చూసిన అతని మామగారైన నీల్కమల్ ముఖర్జీ అతన్ని ఎంతగానో ప్రోత్సహించాడు....................

  • Title :Kalaprapancham
  • Author :L R Venkata Ramana
  • Publisher :L R Venkata Ramana
  • ISBN :MANIMN4820
  • Binding :Papar back
  • Published Date :June, 2023
  • Number Of Pages :200
  • Language :Telugu
  • Availability :instock