• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kalathapaswi Kalabharanalu

Kalathapaswi Kalabharanalu By Rakesh Boddula

₹ 250

నా జీవితంలో 'కళాతపస్వి' ప్రభావం

చిన్నతనం నుండి కమర్షియల్ సినిమాలు పెద్దగా ఇష్టపడి చూసేవాణ్ణి కాదు. ఒకవేళ చూసినా అందులో కొంతైనా మంచి కథ ఉన్న వాటినే ఎంచుకుని చూసేవాడిని. అదేంటో మరి.. నా తోటివాళ్లంతా ఒక రకమైన ఇష్టాలు కలిగి ఉంటే.. నాకు మాత్రం కథ, సంగీతం, మంచి పాట అని వెతుక్కునే వాడిని. ఇలాంటి ఇష్టాలు ఉన్న నాకు సాధారణంగానే కళాత్మక చిత్రాలు నచ్చుతాయి. ఎందుకంటే.. అందులో ఇది లోటు అని చెప్పడానికి ఏదీ ఉండదు. మంచి నటీనటులు, అభినయానికి ప్రాధాన్యం, కళ్లతోనే పలికించే ఎన్నో భావాలు, అర్థవంతమైన పాటలు.. వీటన్నిటి సమాహారంగా కళాత్మక చిత్రాలు సాగుతాయి. మరి అలాంటి చిత్రాలు తీయడంలో సిద్ధహస్తులు, నేర్పరి.. కళాత్మక చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు కళాతపస్వి శ్రీకాశీనాథుని విశ్వనాథ్ గారు.

ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలియకుండానే ఆయన సినిమాలు చూడడం మొదలు పెట్టాను. తెలిసీ తెలియని వయస్సులో కూడా ఎందుకో నా మనసుకి అవి బాగా నచ్చేవి. అం చేసుకునేంత పరిజ్ఞానం, మేధస్సు అప్పుడు లేకపోయినా చూడటానికి ఎంతో ఇష్టపడేవాడిని. చేసుకోలేని విశ్వనాథ్ గారి సినిమాల్లో కథ కావచ్చు.. నాలాంటి అల్పజ్ఞాని అంత తొందరగా అర్థం సన్నివేశాలు కావచ్చు.. అందులోని నటీనటులు మొహంలో పలికించే భావాలు కావచ్చు.. నిగూఢమైన సంభాషణలు కావచ్చు.. కానీ, ఆయన సమాజానికి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని మాత్రం అనిపించేది. నా వయస్సు పెరుగుతున్న కొద్దీ విశ్వనాథ్ గారి సినిమాలపై మరింత ఇష్టం పెం అర్థం చేసుకునేంత జ్ఞానం కొంచెం వచ్చింది.

ఒక మనిషి ఇలా ఎలా సినిమాలు తీయగలడు..? ఇంత కళాత్మకంగా ఎలా రక్తి టే.. కట్టించగలడు..? ఎక్కడా అసభ్యకరం అనేదే లేకుండా సినిమాని ఎలా నడిపించగలడు..? ఆయన సినిమాల్లోనే నటీనటులు ఇంత గొప్పగా ఎలా జీవించగలరు..? ఆయన సినిమాల్లో పాటలు, సంగీతం ఎందుకు అంత గొప్పగా ఉంటాయి..? మనసులో అనుకున్నది ఇంత అద్భుతంగా న్నే ఎలా తెరపై చూపించగలడు..? మనలాంటి సామాన్యుల గుండెలో స్థానం ఎలా సంపాదించగలడు..? అది ఆ కాశీనాథుని విశ్వనాథ్ ఒక్కరికే సాధ్యం. ఆయనకి ఉన్న కోటానుకోట్ల భక్తులలో నేనూ ఒకడిని. అప్పుడే నిర్ణయించుకున్నాను.. నాకు ఊహ తెలుస్తున్న ఆ తొలి రోజుల్లోనే అనుకున్నాను.. ఏ రోజుకైనా ఆ మహానుభావుడిని ఒక్కసారైనా కళ్లారా చూడాలని.. ఆయన పాదాలు తాకాలని. కానీ ఎలా..? ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన నాకు బయట ప్రపంచం. పెద్దగా తెలియదే..!! అసలు కలవాలి అంటే ఎలా, ఏ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాలో కూడా నా ఆలోచనలో లేదే.. ఎలా.. ఎలా?.............................

  • Title :Kalathapaswi Kalabharanalu
  • Author :Rakesh Boddula
  • Publisher :Rakesh Boddula
  • ISBN :MANIMN6667
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :198
  • Language :Telugu
  • Availability :instock