• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kalinga Desa Charitra

Kalinga Desa Charitra By Rallabandi Subbarao Garu

₹ 500

సంపాదకీయ విజ్ఞాపనము

ఆంధ్రదేశీయేతిహాసపరిశోధకమండలివారు రాజమహేంద్రవరమున 1922లో రాజరాజనరేంద్రుని నవమశతాబ్ద వర్ధంత్యుత్సవమును జరిపి, తూర్పు చాళుక్యుల చారిత్రాంశములు గల యొక్క సంచికను ప్రకటించిరి. 1924లో నేను రాజమహేంద్రవరపు సర్కారు కళాశాల యందు చారిత్రకోపన్యాసకుడుగా నియమింపబడి యుండగా, మండలివారు నన్నా సం॥ ననే గౌరవ కార్యదర్శిగా నెన్నుకొనిరి. మండలి యుద్దేశముల ప్రకారమును, మండలి స్థాపకులలో నౌకరుగు డాక్టరు చిలుకూరి నారాయణరావు, ఎం.ఏ.ఎల్.టి, పిహెచ్.డి గారి ప్రోత్సాహమునను, కళింగ వర్ధంత్యుత్సవమును జరుపుటకును, కళింగ సంచికను ప్రకటించుటకును, నిశ్చయించితిని. మండలికోరిక నెరవేర్చుటకై, ఆ సంవత్సరాంతముననే, చరిత్ర పరిశోధకులకును, పండితులకును, కళింగదేశమునకు సంబంధించిన చారిత్రక వాఙ్మయాదివిషయములను గురించిన వ్యాసములను వ్రాసి పంపవలసినదని కోరితిని.

చరిత్రను గూర్చి ఆయా రాష్ట్రములందలి విద్యాధికులు, పరిశోధనమండలులను స్థాపించుకొని, చారిత్రక, వాఙ్మయ పరిశోధనలను చేయుచు, తమతమ దేశభాషలయందు చారిత్రక, వాఙ్మయ విషయముల నభివృద్ధి చేసికొనుచు, వారివారి మండలిసభలలో పరిశోధనలవలన తేలిన విషయములు నచ్చొత్తించి పత్రికారూపమున వెల్లడి చేయుచున్నారని తెలిసికొనుటచే, ఈ మండలిసభ్యుల సంఖ్య హెచ్చించుటకును, మండలికి కార్యాలయ మొకదాని నేర్పరుచుటకును, మండలి సభ్యులచే జేయబడిన పరిశోధనలను ఆంగ్ల భాషలో ప్రకటించుటకై త్రైమాసిక పత్రిక నొకదానిని సంపాదించుటకును, 1925 సంవత్సరమంతయు తగు ప్రయత్నములను జేసితిని. తల పెట్టిన కళింగ సంచికకు కొన్ని వ్యాసములను సంపాదించితిని. మండలిసభ్యుల సంఖ్య హెచ్చింపగల్గితిని. మండలికొక కార్యాలయముగూడ చేకూరెను.

1926 సం||న మండలియొక్క ముఖ్యోద్దేశములన్నియు నెరవేరెను. ఆంగ్ల త్రైమాసిక పత్రిక ప్రథమసంపుటముయొక్క ప్రథమ ద్వితీయభాగములు వెలువడుటచేతను, కళింగదేశ చరిత్ర కుపయోగకరమైన వ్యాసములు 14 వరకు నాకు చేకూరుటచేతను, మండలి వారు తమ కార్యనిర్వాహకవర్గపు సభలో, నన్ను, కళింగదేశ చరిత్రమునకు సంపాదకునిగాను, శ్రీయుతులు చిలుకూరి నారాయణరావు ఎం.ఎ.ఎల్.టి., వడ్డాది అప్పారావు బి.ఎ., బి.ఎల్., భావరాజు.............

  • Title :Kalinga Desa Charitra
  • Author :Rallabandi Subbarao Garu
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN6120
  • Binding :Hard Binding
  • Published Date :March 2017
  • Number Of Pages :916
  • Language :Telugu
  • Availability :instock