• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kallola Bharatham

Kallola Bharatham By Kovela Santhosh Kumar

₹ 275

కల్లోల భారతం
 

అస్తిత్వం పోగొట్టుకున్న జాతి

మన నాగరికత ఆనవాళ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసా?? వేదాల్లో అతి ప్రాచీనమైనదీ. పవిత్రమైన వేద వాఙ్మయంలో మొట్టమొదటిదైన ఋగ్వేద సూక్తాలు ఆవిష్కారమైన ప్రాంతం ఎక్కడున్నదో తెలుసా? ఋగ్వేద మంత్ర ద్రష్టలైన మహర్షులు అనేక మంత్రాలను దర్శించిన అనేక దివ్య నదీ తీరాలు ఎక్కడున్నాయో తెలుసా? అత్యద్భుతమైన దివ్యజీవన నాగరికత సుసంపన్నమైన సప్త సింధు నదులు ఏమైపోయాయి? భారత దేశాన్ని సస్యశ్యామలం చేసి ప్రపంచంలోనే సంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దోహదపడిన నదులు ఇప్పుడు ఎక్కడున్నాయి? భారతీయ అతి ప్రాచీన నాగరికతకు ఆలవాలమని భావిస్తున్న హరప్పా, మొహంజోదారో వంటి ప్రాచీన నగరాల ఆనవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? మన ప్రాచీన సంస్కృతికి ఆధారభూతమైన నగరం.. అర్జునుడి మనవడు పరీక్షిత్తు పరిపాలించిన రాజధాని.. వైశంపాయనుడు మొట్టమొదట మహాభారతాన్ని వినిపించిన పవిత్రమైన ప్రాంతం తక్షశిల నగరం ఇప్పుడు ఎక్కడున్నది..?

ఇవన్నీ ప్రశ్న.. మన చరిత్ర పుస్తకాల్లో రాసుకోవడానికి, చదువుకోవడానికి 28 మాత్రం పనికొస్తున్నాయి. కానీ ఇవేవీ కూడా ఇవాళ మనకు కాకుండా పోయాయి. మన మూలాలు ఎక్కడున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే.. పక్కన పాకిస్తాన్ వైపు వేలు చూపించాల్సి వస్తున్నది. మన నాగరికత ఆనవాళ్లు ఎక్కడున్నాయని ఎవరైనా అడిగితే.. 90 అదిగో పాకిస్తాన్లో అని అటువైపు చూడాల్సి వస్తున్నది. మన చరిత్ర, సంస్కృతి మూలాలు.. పరమ సుసంపన్నమైన సరస్వతీ నదీ నాగరికతావైభవంలో అధికభాగం పాకిస్తాన్లో కలిసిపోయింది.

ఒకనాడు ఋగ్వేదం ప్రవచించిన కుభా.. ఇవాళ కాబూల్ నదిగా మారిపోయింది. కుర్రమ్ నది.. కృమిగా పేరు మార్చుకొన్నది. గోమతి కాస్తా.. గోమల్గా గోల్మాల్ అయిపోయింది. ప్రాచీన భారతీయ చరిత్రలో అత్యంత ముఖ్య ప్రాంతమైన సువస్తు నగరం ఇప్పుడు స్వాత్గా రూపాంతరం చెందింది. ఆఫ్గనిస్తాన్, పంజాబ్ మధ్య ఉన్న ప్రాంతం (ఇవాల్టి పాకిస్తాన్) అంతా ఒకనాడు సప్త సింధు ప్రాంతం. 1. కుభా (కాబూల్), 2. సింధు 3. వితస్త (ఝలమ్), 4, అసిక్న (చినాబ్), 5. పరుష్టి (రావి), 6. విపాశ (బియాస్), 7. శతద్రు (సట్లెజ్).. ఇవి సప్త సింధు నదులు. వీటి పేర్లు ఇప్పుడు ఇలా పూర్తిగా మారిపోయాయి..................

  • Title :Kallola Bharatham
  • Author :Kovela Santhosh Kumar
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN6468
  • Binding :Papar Back
  • Published Date :Sep,l 2025
  • Number Of Pages :368
  • Language :Telugu
  • Availability :instock