₹ 350
ఒక తరం అనుభవించిన సంక్షోభిత కాలం కథ
ఇది మా తరం కథ. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జన్మించిన వారి కథ. వ్యక్తిగతంగా, సామాజిక - రాజకీయ పరంగా మాతరం అనుభవించిన "ఆత్మక్షోభ" కథ "కాలం కత్తుల వంతెన" మీద కదసు తొక్కిన "కన్నీటి కాలం కథ" నెత్తురు నిండి శక్తులు మండిన మా తరం కన్న కలలన్ని కల్లోలానికి గురై కల్లలుగా మారి జీవితమే ఒక "పగిలిన అద్దం" లా మిగిలిన మా తరం కథ.
ఖండిత శిరస్సు తెగిపడి నెల వాలినా ఆ కళ్లల్లోని ధిక్కార స్వభావాన్ని మాత్రం కల్పోని తరం మాది. చేసిన యుద్ధాలలో క్షతగాత్రులమైనా, మన్సులోపలి గాయాలు మానకుండా ఇంకా పచ్చిగానే సలుపుతున్నందున , గతం చేసిన గాయాలను గానం చేసి ఈ తరం వారికీ అర్ధం అయ్యేలా చెప్పటం కోసమే చేసిన యాత్ర ఈ "అక్షర యానం".
- Title :Kallola Kalala Kaalam
- Author :Paravasthu Lokeshwar
- Publisher :Sahithi Prachuranalu
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :523
- Language :Telugu
- Availability :instock