• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kanakadasu

Kanakadasu By Dr G S Mohan

₹ 50

  1. నేపథ్యం

వీడెవ్వడు వీడెవ్వడు వీడెవ్వడని పలికింపకయ్య

నావాడు నావాడు నావాడితడని పలికింపుమయ్య

ఇలా పరమభక్తుడైన బసవన్న కూడల సంగమదేవుని ప్రార్థించాడు. ఆయన దృష్టిలో ఇది జీవితపు సార్థకత కూడ. ఆయన ఈ ఆశయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ సిద్ధించింది. భక్తుడైన కనకదాసులవారిని నేడు శబర, నాయక, కురుబ కులస్థులు 'అతను మావాడు, అతను మావాడు' అని తమ హక్కును వినియోగిస్తున్నారు. అలాంటి సార్థకమైన జీవితాన్ని గడిపిన ఆ కనకదాసులవారు ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఎక్కడి వారు? ఏ కాలంలో జీవించారు? ఆయన జీవిత విశేషాలకు సంబంధించి ఎంతవరకు సమాచారం లభిస్తుంది. - ఇత్యాది విషయాలను ఒకసారి పరిశీలించాలి.

దాదాపు వేయి సంవత్సరాల కన్నడ సాహిత్యచరిత్రను గమనిస్తే సామాజిక దృష్టికలిగిన రెండు ప్రముఖదశలు కన్పిస్తాయి. ఒకటి, పన్నెండవ శతాబ్దంలో శివశరణుల 'వచనసాహిత్య' యుగం. రెండోది, పదిహేనవ శతాబ్దంనుంచీ ప్రారంభమయ్యే హరిదాసులు 'దాససాహిత్య' యుగం. ఈ రెండూ కన్నడ సాహిత్య సంప్రదాయంలో సువర్ణాధ్యాయాలు. విప్లవాత్మకమైన జీవనతత్త్వాన్నీ, ఆదర్శప్రాయమైన విచ్చేనల్నీ సామాన్య జనులకు అర్థమయ్యేరీతిలో కన్నడిగులకు బోధించినవాళ్ళు శరణులు, హరిదాసులు. మాటల్లో, నడవడుల్లో ఒకటిగా జీవించిన వీళ్ళ జీవితం వీళ్ళ బోధనలలాగనే ప్రజలకు ఆదర్శప్రాయమైంది. ఈ రెండు సాహిత్య సంప్రదాయాలు, దేశప్రజల జీవితాలు రాజకీయంగా, ధార్మికంగా, సామాజికంగా కష్టాలకు లోనైనప్పుడూ; సాంస్కృతికంగా అతిక్రమించిన పరమతస్థులు గావించిన మతాంతరాలు, బలాత్కారాలు, హత్యలు, దోపిడులు ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్థం చేసిన దశలోనే ఆవిర్భవించాయి.................

  • Title :Kanakadasu
  • Author :Dr G S Mohan
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN4730
  • Binding :Papar Back
  • Published Date :2021
  • Number Of Pages :110
  • Language :Telugu
  • Availability :instock