• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kanchelpai Dehalu

Kanchelpai Dehalu By K Usha Rani , Brahma Prakash

₹ 190

ఉక్కిరిబిక్కిరి అయినవేళ
 

నియంత్రణల నడుమ జీవితం

"నేను అందరికీ స్వేచ్ఛ ఉండాలని నమ్ముతాను. కాళ్ళు, చేతులు చాపుకోడానికి, మనసుల వైశాల్యం పెంచుకోవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి, ఓటు వేసి ఎన్నుకునే హక్కు, స్నేహితులను ఎంచుకొనే హక్కు, సూర్యరశ్మి ఆనందాన్ని అనుభవించే హక్కు జాతి వివక్ష లేకుండా రోడ్లపై పరుగులు తీసే హక్కు - ఆలోచిస్తూ, కలలు కంటూ పనిచేసుకుంటూ, దేవుని ప్రేమామృత ప్రపంచంలో బతకడానికి. డబ్ల్యు. ఎ.బి. డూ బోస్.

నువ్వు ఉక్కిరి బిక్కిరైనప్పుడు ఏం చేస్తావు? ఊపిరి నిలుపుకునే ప్రయత్నం చేస్తావు. గొంతులో అడ్డం పడినప్పుడు? దగ్గి బయటకు వచ్చేట్టు చేస్తావు. బంధించబడినట్టు భయమేస్తే? బయటికి వచ్చే ప్రయత్నం చేస్తావు. బంధంలో బంధించబడిన భావన కలిగితే, బంధం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తావు. నువ్వున్న గ్రామమో పట్టణమో నీకు అడ్డంకిగా మారితే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తావు. నువ్వు అనుసరిస్తున్న మతమో, సంస్కృతితో నీ స్వేచ్ఛను హరిస్తే తప్పించుకునే ప్రయత్నం.. చేస్తావు. నువ్వున్న దేశం నీకు 'నాదనే అనుభూతి' ఇవ్వకపోతే. అంబేద్కర్ అడిగినట్టే. లేదా ఒక శరణార్ధి అడిగినట్టే, 'నా దేశం ఎక్కడ? నేనిక్కడివాడినేనా ? నేను ఊపిరి పీల్చుకోగలనా? ఏ అడ్డూ అదుపూ లేకుండా సంచరించగలనా? నల్లటి పొగ ఆకాశాన్ని సుళ్ళు తిరుగుతూ కమ్మేస్తే, ఊపిరాడక పక్షులన్నీ ఆకాశం నుంచి జలజలా రాలి పడిపోతుంటే, శ్రావ్యంగా కూయాల్సిన పక్షులు కన్నీటితో 'నా స్వచ్ఛమైన గాలేదీ? కంచెల పై దేహాలు........................

  • Title :Kanchelpai Dehalu
  • Author :K Usha Rani , Brahma Prakash
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN5703
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :179
  • Language :Telugu
  • Availability :instock