• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kandili
₹ 150

మొదటి గంట
 

పెద్దింటి అశోక్ కుమార్

డబుల్ బెడ్ రూమ్ పథకానికి ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టినంక ఎర్రగుట్ట పల్లెకు పదమూడు ఇండ్లు సాంక్షన్ అయినయి. కట్టుడు కూడా పూర్తయినయి. లోకల్ ఎమ్మెల్యే పార్టీలో పవర్ ఫుల్ కాబట్టి ఇండ్లను కొట్లాడి తెచ్చుకున్నడు. వారంల ఓపెనింగ్. మంత్రి గారు రావడం కూడా ఖాయమైంది. మీటింగ్ ఏర్పాట్లను చూసుకోవడానికి కలెక్టర్ పల్లెకు వస్తున్నట్లు బడిలో లెక్కల సారుకు తెలిసింది.

వెంటనే ఈ ముచ్చట పెద్ద సారు చెవులు వేసిండు. వేస్తూ వేస్తూ చిన్న సలహా కూడా ఇచ్చిండు. “సార్ మనం మస్తు కష్టపడుతున్నం. కానీ మొన్న ఎండాకాలం ట్రైనింగ్ ల డియివొ సార్ ఏమన్నడు యాదికుంది గదా. మన పర్ఫామెన్స్ ఏం బాగాలేదట. పిల్లలకి ఏం చెప్తలేమట. ఇజ్జత్ తీసిండు. అందుకే ఒక పని చేద్దాం. మన టెన్త్ క్లాస్ ల నవీన్ గాడు ఉన్నడు గదా. వానితో కలెక్టర్ ముందు ఒక మెమరీ ప్రోగ్రాం ఇప్పిద్దాం. వీడియో తీసి వాట్సప్ గ్రూపులల్ల ఫేస్ బుక్ ల ఇనాల పెడుదాం. అప్పుడు తెలుస్తది మనం చేస్తున్నమో లేదో..” అన్నడు.

పెద్ద సార్ కు నిజమే అనిపించింది. బడులు అపుడప్పుడే తెరిచిండ్రు. బడి బాట ముగించుకుని సార్లు డ్రస్సులు పుస్తకాలు పంచుతుండ్రు. పెద్ద సారు పొద్దున మాపున బడిని పట్టుకుని ఉంటుండు. పిల్లల కోసం ఇల్లిల్లు తిరుగుతుండు. కానీ ఎక్కడ గుర్తింపు లేదు. ఏ పని చేయనోళ్లు బడికి ఎగబెట్టేటోల్లు పెద్దగ సదువు చెబుతున్నట్టు అక్షరాభ్యాసం మొదలు పుస్తకాలు పంచేదాక ఏవేవో వీడియోలు చేసి హంగామా.............

  • Title :Kandili
  • Author :Dr Dharani Kota Ramesh Babu
  • Publisher :Logili.com
  • ISBN :MANIMN6557
  • Binding :Papar back
  • Published Date :July, 2025
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock