ఆన్ ది రన్ రాత్రి సమయంలో కూడా పట్టపగలులా అనిపిస్తోంది ఆ రోడ్ అంతా. రోడ్ ఎంట్రన్స్లో నాలుగో బిల్డింగ్ అందంగా, అధునాతనంగా, దేదీప్యమానంగా అలంకరించబడి వుంది. ఎటుచూసినా నియాన్ లైట్లు అందమయిన డిజైన్స్ ఏర్పరచిన లైట్లు వుండుండి జిగ్-జిగమని వెలిగి... ఆరి... వెలుగుతున్నాయి. బిల్డింగ్ మెయిన్ గేటుమీద మాత్రం పెద్ద లైటింగ్లో లెటర్బోర్డ్ ఎరేంజ్ చేశారు. "వెల్కం!” అన్న అక్షరాలు ఇంగ్లీషులో ఆహుతుల్ని ఆహ్వానిస్తున్నాయ్. బిల్డింగ్ పోర్టికోలోనూ, రోడ్ మీద కూడా రకరకాల కార్లు, ఖరీదయిన కార్లు సుమారు నలభై వరకూ పార్క్ చెయ్యబడి వున్నాయ్. తెల్లటి డ్రస్ మల్లెపూవుల్లా వెలిగిపోతున్న ఇండో-రష్యన్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు "రాణిపాల్ ఏజంట్ల'లా ఎటుచూసినా దర్శనమిస్తున్నారు. ఫ్రంట్ ఎంట్రన్స్లో నిలబడి వుంది శ్వేతప్రియ. డాక్టర్ పద్మప్రియకు క్లోజ్ ఫ్రెండ్! అతిథులను ఆహ్వానిస్తోంది. ఫ్రెండ్స్తో తిరుగుతున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా పద్మప్రియ మనస్సు మాత్రం అక్కడలేదు. కారు హారన్ వినిపిస్తే చాలు ఆమె చూపులు కంగారుగా ద్వారంవైపు పరుగెడు తున్నాయి. వచ్చిన కారుని, అందులోంచి దిగుతున్న మనుషుల్ని చూడగానే ఆమె మొహం చిన్నబోతోంది. ఏమిటి మనిషి ఉద్దేశ్యం? కరెక్ట్ గా ఏడుగంటలకల్లా ఫంక్షన్ స్టార్టవుతుంది. నువ్వు ఏడుగంటలయ్యేసరికి నా ప్రక్కన వుండాలి. లేదా నేనసలు ఫంక్షన్ కాన్సిల్ చేసుకుంటాను అని తను ఖచ్చితంగా చెప్పింది.................. |