• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kanniti Kashmir lo Oka Amma

Kanniti Kashmir lo Oka Amma By Shahnaj Bashir

₹ 175

తలపోత

అప్పుడే నిద్ర లేచి కూర్చుంది హలీమా. ఆమె మది ఎక్కడెక్కడో తిరుగాడుతోంది. ఏవేవో జ్ఞాపకాలను తిరగదోడుతోంది. మంచు, దుమ్ము, ఆటోలు, కాగితంతో చేసిన రాకెట్లు, ఫోటోలు, చిరునవ్వులు, ప్లాస్టిక్ సంచులు, తుపాకులు, తలుపులు, గొంతులు, ముఖాలు, అద్దాలు, డాల్ఫిన్లు, జెండాలు, కాలిన గాయాలు, గోడలు, నీడలు, మౌనాలు, సిగరెట్ పీకలు, పాటలు, పావురాలు ముక్కలుగా ముక్కలుగా కదలాడిపోతున్నాయి. ఆ జ్ఞాపకాలలో...

...

"తీవ్రమైన దుఃఖాలు గొప్ప ఆశల్ని కూడా వెంటపెట్టుకొస్తాయి. అత్యంత కటువైన పరిస్థితులు అత్యంత సహనాన్ని కూడా తీసుకొస్తాయి”. నిద్ర లేస్తూ ఇమామ్ చెప్పిన ఈ మాటల్ని లోలోపల గొణుక్కుంటూ మననం చేసుకుంది. రాత్రి తినడానికి ముందే నిద్రలోకి జారుకుందామె. ఆ నిద్రలో తనకు కలలే రానందుకు, అలా నిద్ర పోగలిగినందుకు తన మీదే తనకే అసహనం కలిగింది.

నిద్రలేవగానే ఒంటి నుంచి వచ్చే ఒకలాంటి వాసన కూడా తనను చికాకు పెట్టింది. ఇంకా స్పృహతో ఉన్నానన్న వాస్తవాన్ని భరించలేకపోయింది. అస్సలు ఇంకా బతికే ఉన్నానన్న ఆలోచనే తన మీద తనకి అసహ్యం పుట్టేలా చేసింది. చచ్చిపోయి ఉండుంటే బాగుండేదనుకుంది.

రాత్రి ఇంటిని కమ్ముకున్న ఆ సమయాన వంటింటి కిటికీ అంచున ఉన్న వెడల్పాటిగట్టు మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది హలీమా. చంద్రకాంతిలోని చీకటిని చూస్తున్న ఆమెకు చివరకు ఇప్పుడు చంద్రుడన్నా అసహ్యమేసింది.

ఇమ్రాన్ని తీసుకెళ్ళిపోయాక నేల మీద కూలబడిపోయింది. నిస్సహాయంగా పైకి జుట్ట చిందర చూస్తూ. కొట్లాటలో ఎవరో తలపట్టుకుని లాగినట్టు ఆమె ముఖం మీద వందరగా పడింది. అదేమీ పట్టించుకోకుండా ఆమె ఇంకా అలా చీకటి ఆకాశాన్ని చూస్తూనే ఉంది. నిస్సహాయంగా రోదిస్తూ, దేవుడి కోసం వెతుక్కుంటూ. కానీ అక్కడామెకు కేవలం చంద్రుడు మాత్రమే కనబడ్డాడు. ఏమీ పట్టని బండలా. కదలకుండా మెదలకుండా........

  • Title :Kanniti Kashmir lo Oka Amma
  • Author :Shahnaj Bashir
  • Publisher :Malupu Publications
  • ISBN :MANIMN4004
  • Binding :Paerback
  • Published Date :Sep, 2022
  • Number Of Pages :190
  • Language :Telugu
  • Availability :instock