గురజాడ స్మారక భవనం స్థితిగతులు
గురజాడ ఇందిర
నేను గురజాడ ఇందిరను. గురజాడ మునిమనవడు గురజాడ
వెంకటేశ్వర ప్రసాద్ గారి అర్ధాంగిని. మహాకవి గురజాడగారి బాల్యం, విద్యాభ్యాసం, సంస్థాన, సాహిత్య జీవితం గురించి లోకానికి చాలవరకు తెలుసు. ఆ మహాకవి వారసురాలిగా నేను సాహితీ ప్రియులకు, సమాజానికి మరికొంత సమాచారాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత వుంది.
శ్రీ మహాకవికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పేరు లక్ష్మీనరసమ్మ, ఈమెను ఓలేటి వంశం వారికి ఇచ్చి వివాహం చేసారు. రెండవ కుమార్తె అప్పలకొండమాంబ (రాణి అప్పల కొండమాంబ మీద ఉన్న గౌరవం కొద్దీ ఆమె పేరు పెట్టుకున్నారు. ఈమెను పులిగెడ్డ వంశం వారికి ఇచ్చి వివాహం చేసారు. కుమారుడు రామదాసుకు అప్పారావుగారు తన తండ్రి రామదాసు పేరు పెట్టుకున్నారు. రామదాసు గారికి, శ్రీపతి వారి ఇంటి ఆడపడుచు అయిన మాణిక్యమ్మను ఇచ్చి వివాహం చేసారు. రామదాసుగారి కుమారుడు గురజాడ వెంకట అప్పారావు, వారి కుమారుడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్. మా నాన్నగారు బుద్ధవరపు సత్యనారాయణమూర్తి మహాకవికి వీరాభిమాని, భక్తుడు, నాన్నగారు పట్టుబట్టి నాకు వెంకటేశ్వర ప్రసాద్ గారితో వివాహం జరిపించి నన్ను గురజాడ కుటుంబంలో చేర్చారు. గురజాడ ఇంటిపేరు నన్ను అదృష్టంగా వరించింది.
అప్పారావు గారి తమ్ముడు శ్యామలరావు అప్పారావుని మించిన తెలివి తేటలు కలవాడు. వీరు కూడా వ్యాసాలు పద్యాలు రాసేవారు. కానీ చిన్నతనంలోనే జలఉదరం అనే వ్యాధితో చనిపోయాడు. ఇది అప్పారావు గారిని బాగా కలచివేసింది. కారణం తమ్ముడితో అనేక విషయాలు చర్చించే..........