ఉపోద్ఘాతం
కప్ప, యువరాణి
జీవితంతో ఒక అద్భుతం చెయ్యటానికీ, సుఖసంతోషాలు, అద్భుతమైన బాంధవ్యాలు, అత్యుత్తమమైన ఆరోగ్యము, సంపూర్ణమైన అభివృద్ధి, సమగ్రమైన సంతృప్తి అనుభవించటానికి మీరు ఈ భూమి మీదికి వచ్చారు. మరి, మీరు కలలుగన్న జీవితం ఎందుకు జీవించటంలేదు?
మీ సుఖ దుఃఖాలకూ, సఫలతకూ- వైఫల్యానికీ, జయాలు- అపజయాలకు కారణాలు తెలుసుకోవాలంటే దగ్గరలోఉన్న అద్దంలో చూడండి. అద్దంలో కనబడే వ్యక్తిని గురించి మీ ఆలోచనలు ఎంతనాణ్యంగా ఉంటాయో, మీ జీవితంకూడా అంత నాణ్యంగా ఉంటుంది. మిమ్మల్ని గురించి మీ ఆలోచనలు మార్చుకున్న మరుక్షణం మీ జీవితం మారిపోతుంది.
జానపద కథ
అనగనగా ఒకనాటి జానపదకధలో పగబట్టిన ఒక మంత్రగత్తె ఒక అందమైన యువరాజును కప్పగా మార్చివేస్తుంది. ఎవరైనా ఒక యువరాణి ఆయనను ముద్దు పెట్టుకుంటే ఆ శాపం తీరిపోతుంది. అలా ఎన్నటికీ జరుగదని ఆ మంత్రగత్తె దృఢవిశ్వాసం.
అనగనగా అదే కాలంలో ఒక అందమైన యువరాణి అందమైన ఒక యువరాజును పెళ్లి చేసుకోవాలని కలలు గన్నది. కాని ఆమెకు ఆ అందమైన...............