₹ 120
'బాబీ', ఈ మధ్య తరచుగా నా కలల్లో, కళ్లలో కదుల్తున్నావు' - అన్నది ఓనాడు అమ్మ. ఆమెలో ఏదో నీరసం. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తి వదనంపై ఏదో నీలి ముసుగు. అంతకు మూడేళ్లముందు డయాబెటిస్ ఆమెను మందుల కుంపట్లోకి నెట్టింది. కానీ గత రెండు నెలలుగా ఆమెలో ఏదో మార్పు. అప్పుడప్పుడూ జ్వరం. ఆకలి లేకపోవడం. నాన్నగారు గతించి ఏడేళ్లయ్యింది. అమ్మ ధైర్యంగా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూనే ఉన్నది.
ఈసారి కడుపునెప్పి, తెరలు తెరలుగా. అనుమానం రాగానే అమ్మకు అల్ట్రాసౌండ్ చేసాను. లివర్ లో మెటాస్టెసిస్. మరుసటి రోజు నేను పనిచేసే ప్రతిమా మెడికల్ కాలేజీలో సి.టి. స్కాన్ చేసాం. అంతటి అలసటలోనూ ఆమె నడిచే లాబ్ లోకి వెళ్లింది. రిపోర్టులు నా డయాగ్నసిసను బలపరిచాయి. అమ్మకు పాంక్రియాటిక్ క్యాన్సర్. టెయిల్ ఆఫ్ ది పాంక్రియాస్లో ఉండడం వల్ల అమ్మ ఇన్నాళ్లూ తట్టుకోగలిగింది. ఆఘమేఘాలమీద హైదరాబాదు బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు వెళ్లాం. నాకు తెలిసిన డాక్టరు మిత్రులేవాళ్లు ఇద్దరూ! ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.
కరెక్టుగా నెలరోజుల్లోపునే అమ్మ దూరతీరాలకు తరలిపోయింది. అమ్మ బతుకునిచ్చింది. నాన్నబతకడం నేర్పారు. వారిని స్మరించుకుంటూ... ఈ పుస్తకం.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
- Title :Karkatakam
- Author :Dr Lanka Siva Rama Prasad
- Publisher :Dr Lanka Siva Rama Prasad
- ISBN :MANIMN2619
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :132
- Language :Telugu
- Availability :instock