• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Karl Marx Medho Parinamam

Karl Marx Medho Parinamam By Rojar Garawdy , Non Apothikar

₹ 200

మా మాట

ఇది సమీక్ష ప్రచురణల పదవ ప్రచురణ. తొలి తొమ్మిది పుస్తకాలు వరుసగా ఇవి : ఆంటోనియో గ్రాంసీ: జీవితం - కృషి (రచన: సుశీ తారు), నూటయాభై సంవత్సరాల కమ్యూనిస్టు ప్రణాళిక (వ్యాస సంకలనం వ్యాసకర్తలు: కె. బాలగోపాల్, ఎన్. అంజయ్య, కె. చిన్నయసూరి), రష్యన్ విప్లవం (రచన : రోజా లగ్జంబర్గ్), నాగరికత - దాని అపశృతులు (రచన : సిగ్మండ్ ఫ్రాయిడ్), వినవోయీ! అల్పజీవి (రచన : విల్పాలె రైక్), లెనిన్ అంతిమ పోరాటం (రచన : మోషే లెవిన్): మార్క్స్, అంబేడ్కర్: మానవ విమోచనా దృక్పధాలు (రచన: ఆనంద్ తేలుంబ్లే), మొదటి ఇంటర్నేషనల్: చారిత్రక సమీక్ష (రచన : మార్సెల్లో మస్తో), ఆనంద సాగరం (రచన: దలైలామా, డెస్మండ్ టుటు, డగ్లస్ అబ్రామ్స్). వీటిలో అయిదు పుస్తకాలు మార్క్సిస్టు ఆలోచనా ధోరణికి చెందినవి కాగా, రెండు పుస్తకాలు ఫ్రాయిడియన్ ఆలోచనా రీతికి చెందినవి, ఒక పుస్తకం మార్క్, అంబేడ్కర్ ఆలోచనల తులనాత్మక పరిశీలన.

ఇప్పుడు సమీక్ష ప్రచురణలు మీముందుకు తీసుకువస్తున్న పుస్తకం కార్ల్ మార్క్స్ - మేధో పరిణామం. ఈ పుస్తకం ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, సిద్ధాంతవేత్తగా ఉన్న రోజర్ గరౌడీ ఫ్రెంచి భాషలో రాసిన పుస్తకానికి Karl Marx: Evolution of His Thought అనే పేరుతో చేసిన ఆంగ్లానువాదానికి తెలుగు అనువాదం. ఆంగ్ల గ్రంథాన్ని న్యూయార్స్లోని ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ 1967లో ప్రచురించారు. నాన్ అపోతికర్ ఫ్రెంచి నుండి ఇంగ్లీషులోకి, కాత్యాయని ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించారు.

ఈ పుస్తక రచయిత రోజర్ గరౌడీ 1913లో ఫ్రాన్స్లోని మార్సైలో జన్మించాడు. 1933లో ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ ఆక్రమణకి వ్యతిరేకంగా సాగిన ఫ్రెంచి రెసిస్టెన్స్కి చెందిన రేడియోలో, వార్తాపత్రిక లీబర్ట్లో పనిచేశాడు. యుద్ధం తదుపరి కమ్యూనిస్టు పార్టీ తరఫున ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ సభ్యుడిగా, సెనేటర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. పార్టీలో సిద్ధాంతవేత్తగా గుర్తింపబడ్డాడు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. కార్ల్ మార్క్స్ : ఎవల్యూషన్ ఆఫ్ హిజ్ థాట్, ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ సోషలిజం, కార్ల్ మార్క్స్ మేధో పరిణామం..................

  • Title :Karl Marx Medho Parinamam
  • Author :Rojar Garawdy , Non Apothikar
  • Publisher :Samiksha Prachuranalu
  • ISBN :MANIMN3959
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock