₹ 100
డా.సి.నారాయణరెడ్డి గారు అప్పటికే "నాగార్జున సాగర" మని ఒక చారిత్రక కథ కావ్యాన్ని రాసినారు. ఇది తెలుగులో మొట్టమొదటి కథా గేయకావ్యం.
ఏ సంవత్సరమన్నారు సార్?
1995 . మళ్ళి రెండేళ్ళ తరువాత 1957 లో, ఇదిగో ఈ "కర్పూర వసంత రాయలు." కథా గేయకావ్య పరంపరలో ఇది రెండవది.
కావ్యం పేరు బాగుంది సార్.
ఔను బాగుంది. బిరుదు కదా!
ఎవరిదీ బిరుదు సార్?
కుమారగిరెడ్డి అని ఒక రాజు. కొండమీద రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించినాడు. ఇది శ్రీ.శ .1386 నుండి 1402 వరకు .
'కర్పూర వసంతరాయ"లన్న బిరుదు ఆ రాజుకు ఎందుకు వచ్చినట్టు సార్?
ఈయన ప్రతియేటా వసంత ఋతువులో - అంటే కొత్త సంవత్సరం రాగానే ఉత్సవాలు చేస్తుంటాడట. వసంతకాలంలో చేసే ఉత్సవాలు కనుక వసంతోత్సవాలు . వీటిని చైత్రశుద్ద త్రయోదశి మొదలుగా తొమ్మిది రోజులు జరిపిస్తుంటాడట. త్రయోదశి అంటే గమనిస్తున్నావా ! పున్నమికి రెండు రోజులముందు.
- Title :Karpoora Vasantha Rayalu Katha Kala Jhankritulu
- Author :Prof Anumandla Bhoomaiah
- Publisher :Navodaya Book House
- ISBN :MANIMN1561
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :158
- Language :Telugu
- Availability :instock