• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Karunachala Ramana

Karunachala Ramana By M V R Sastri

₹ 200

ఆకాశంలో అద్భుత దృశ్యం

1950 ఏప్రిల్ 14. తిరువణ్ణామలై. శ్రీ రమణాశ్రమం.

శ్రీ శ్రీ భగవాన్ రమణ మహర్షి అవతార సమాప్తి ఆసన్నమయిందని అప్పటికే అందరికీ అర్థమైంది. ఎందరో మహావైద్యుల బృందాలు కొన్ని నెలలుగా చేస్తూ వచ్చిన అన్ని రకాల ప్రయోగాలూ, ఆఖరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి. మహర్షి ఆరోగ్యం అత్యంత విషమం అని పత్రికలు కొద్దిరోజుల కిందటే ప్రముఖంగా ప్రకటించాయి. తల్లడిల్లిన భక్తులు దేశం లోపలా వెలుపలా అన్ని ప్రాంతాలనుంచీ భగవాన్ కడపటి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శరీరం నీదన్న భ్రమను వదులు అని అర్ధ శతాబ్దానికి పైగా అమోఘ బోధ చేసిన ఆధునిక మహాఋషి ఆ భ్రమను ఎలా వీడాలో, భయానక దేహబాధను కూడా తితిక్షతో ఎలా ఉపేక్షించవచ్చో లోకానికి ప్రాక్టికల్గా చూపించటం అనే ఆఖరి పాఠాన్ని అద్భుతంగా పూర్తి చేశారు. ఒంట్లో శక్తి పూర్తిగా నశించినా తాను పరుండిన చిన్నగదిలో నుంచే భగవాన్ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రద్దీని గమనించి దర్శనం వేళను ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు. భగవాన్ ఇంకే మాత్రమూ దర్శనం ఇచ్చే స్థితిలో లేరని ఒక దశలో వైద్యులు గ్రహించి గదికి తెర వేయమని పరిచారకులతో చెప్పారు. భగవాన్ ఒప్పుకోలేదు. వేసిన తెర తొలగించమని సైగ చేశారు. తన పడకను ముందుకు జరిపించి కళ్ళు మూసుకునే లైన్లో వేచి ఉన్నవారికి 6 గంటల వరకూ దర్శనం ఇచ్చారు. భగవాన్ ఇక ఏ క్షణమైనా శరీరం వదలవచ్చని వైద్యులకు అర్థమయింది. భక్తజనం వేల సంఖ్యలో గది చుట్టూ గుమికూడి భగవానకు ఇష్టమైన అక్షరమణమాలను కన్నీటి ధారలతో పారాయణం చేస్తున్నారు.......................

  • Title :Karunachala Ramana
  • Author :M V R Sastri
  • Publisher :Durga Publications
  • ISBN :MANIMN6455
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :165
  • Language :Telugu
  • Availability :instock