Logili Books

Short Stories

Kasepu Navvukundam

By Tarimella Amarnadh

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kasepu Navvukundam
Publisher
Kurapati Ranganayakulu
ISBN
MANIMN6867
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
203
Language
Telugu
Availability
In Stock
About this book

హాస్యమే ఆరోగ్య రహస్యం

వ్యంగ్యాస్త్రమే వ్యవస్థకు ఔషధం

మానవాళికి మాత్రమే లభ్యమైన భగవంతుని వరప్రసాదం నవ్వు. నవ్వు జీవన రసాయనం - ఆరోగ్యానికి తొలి మంత్రం.

నవ్వులో ఎన్నో ధ్వనులున్నాయి. వ్యంగ్యాలున్నాయి, ఆనందాలున్నాయి, దుఃఖాలున్నాయి, పరిహాసాలున్నాయి, హెచ్చరికలున్నాయి. సందర్భాన్నిబట్టి, వ్యక్తుల వ్యక్తిత్వంబట్టి నవ్వును అనేక రకాలుగా, అనేక కోణాల్లో వాడుకుంటాము, ఒక్కొక్క నవ్వుకు ఒక్కోరకంగా స్పందిస్తాము, కొన్ని నవ్వులు ప్రశాంతత నిస్తాయి. కొన్ని నవ్వులు హెచ్చరికలు చేస్తాయి. కొన్ని నవ్వులు మనల్ని నవ్వులపాలయ్యేలా చేస్తాయి. నవ్వును సంస్కృతంలో 'హాసం' అంటారు.

విచ్చుకుంటున్న కళ్ళతో నవ్వితే 'స్మితం'. కొంచెం దంతాలు కనపడేట్టు నవ్వితే 'హసితం'. మధురమైన స్వరంతో నవ్వితే 'విహసితం' లేదా 'ఉపహసితం'. కళ్ళలో నీళ్ళు వచ్చేట్లు నవ్వితే అది 'అపహసితం'. శరీర భాగాలన్నీ కదిలి పోయేటట్లు నవ్వితే దాన్ని 'అతిహసితం' అంటాం.

నవ్వును పలువిధాలుగా పైన చెప్పినట్టు విభాగించిన వారు 'రస గంగాధరం’ అన్న సాహిత్యశాస్త్రం వ్రాసిన పండిత జగన్నాథరాయలవారు.

'ప్రతాప రుద్ర యశోభూషణం' అన్న అలంకారశాస్త్రం రచించిన విద్యానాథుడు కూడా నవ్వు గురించిన విశ్లేషణాలను తెలిపారు.

'నవ్వు నాలుగందాల చేటు' అన్న నానుడి మన తెలుగునాట ఉండగా... 'నవ్వు అన్ని విధాల రైటు' అన్న విశ్లేషణ మనం చేసుకోవాలి.

నాకు ఇటీవల పరిచయమైన గొప్ప మానవతావాది, సేవాతత్పరులు అనంతపురం వాసి శ్రీమాన్ తరిమెల అమరనాథరెడ్డి గారు, కమ్యూనిస్టు భావజాల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వీరు హాస్యప్రియులు.

సాధారణంగా కమ్యూనిస్టు అనగానే ముడిచిన పిడికిలి, ఎత్తైన కొడవలి మన మనోపథంలో నిలుస్తాయి....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?