స్థూలం నుంచి సూక్ష్మంలోకి
పాపినేని శివశంకర్
తెలుగు కథ మెల్లమెల్లగా స్థూలదశనుంచి సూక్ష్మదశలోకి (from macro level to micro level) జరుగుతున్నట్టుంది. స్థూలదశలో సామాజిక పరివర్తనాలు, వ్యవస్థల లోపాలోపాలు ప్రధానంగా ఉంటాయి. సూక్ష్మదశలో వ్యక్తులమధ్య పరస్పర సంబంధాలు, అందలి ఒడిదుడుకులు ప్రధానంగా ఉంటాయి. అట్లా ఒక తరం కిందటి కథలకి, ఇప్పటి వాటికి ఎంతో అంతరం ఉంది. ఇది గుణానికి సంబంధించింది కాదని, పరిణామానికి సంబంధించిందని గుర్తించాలి. ఒక రకంగా ఇది ఒక పద్ధతినుంచి మరో పద్ధతికి మార్పు (paradigm shift) అని కూడా అనుకోవచ్చు.
ఒకప్పటి కథల్లో దోపిడీ, పీడన, వర్గవైషమ్యం, సామాజికార్థిక సమస్యల పరిశీలన, పరిష్కార సూచన, ప్రపంచీకరణ మొదలైనవి ప్రముఖంగా.......................