• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Katha 2023

Katha 2023 By Vasireddy Naveen

₹ 140

పేడే కేర్ కెఫే'ని కళ్లూ, నోరూ వెళ్లబెట్టి చూస్తూ, పిల్లలని డే కేర్ వదిలేట్టు పెంపుడు జంతువులని కూడా వదిలే సౌకర్యమన్న మాట అనుకొంది మంగ. ఆ ప్రాంగణంలో తిరుగుతోన్న రకరకాల కుక్కపిల్లలని, కుక్కలని చూస్తున్నారెందరో. వాటన్నిటికి పేర్లు వున్నాయి. దాదాపు అందరూ ఆ పేర్లు తెలుసుకొని మరీ ఆ పేర్లతో పిలుస్తున్నారు. తెలియనివాళ్లు, వాళ్లకి నచ్చిన అలవాటైన మాటల్లో పలకరిస్తున్నారు. కానీ యెవ్వరు వాటిని యే భాషలోనూ కుక్కలని  మాత్రం అనటంలేదు.

రేవంత్ వెంట మూడేళ్ల మైత్రిని నడిపిస్తూ మైనా, స్ట్రాబెరీని చైన్తో పట్టుకొని డ్రైవర్. స్ట్రాబెరీ రోజూ తినే ఫుడ్ బాస్కెట్తో వాళ్ల వెంట లోపలికి వెళ్తున్న మంగ కెఫేని కుతూహలంగా చూస్తూ నడుస్తోంది.

“మేం ఆఫీస్కి వెళ్లిపొతే వాటికి ఫుడ్ పెట్టటం అవ్వదు కదా. అవి కూడా వొంటరిగా అంతసేపు వుండాలంటే బెంగగా అయి పోతాయి. మాలాగా జాబ్స్ చేసేవాళ్లు వాళ్ల పెట్స్ని యిక్కడ వదలొచ్చు. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే పట్టుకొని వెళ్లొచ్చు. అలానే పనులమీద బయటకి వెళ్లేవాళ్లు యిక్కడుంచి వెళ్లొచ్చు. నెలకో, రోజుకో కట్టొచ్చు. భలే రిలీఫ్ యిటువంటి కెఫేలతో," అంది మైనా. ఆ తరువాత మైత్రిని డేకేర్ వదిలాక, "చూసావు కదా! రోజు యిలా వీళ్లిద్దర్నీ డ్రైవర్ వచ్చి డ్రాప్ చెయ్యాలి," అంది మైనా.

           మంగ తలూపింది.

          కొద్దిరోజుల క్రితమే యూ. యస్ నుంచి మైనా, రేవంత్, మైత్రి యిండియాకి రావటానికి ముందే వాళ్ల యింటిని ఫర్నిష్ చేయించు కొన్నారు. ఆన్లైన్లో స్ట్రాబెర్రీని కొనుక్కున్నారు. మంగని మైత్రి స్ట్రాబెరి పనుల కోసం, యింటిపనికి మరో ఆమెని, ఒక డ్రైవర్ని ఆయా యెజెన్సీలతో అపాయింట్ చేయించుకొన్నారు.

యెంతో ప్లానింగ్తో జీవితంలో ప్రతీది చెయ్యటం వారి జీవిత విధానమవ్వటంవల్ల వారి జీవితం బాగుందా... లేక బాగుండటంవల్ల ఆ జీవితవిధానం వచ్చిందా అని వాళ్లని చూసిన మొదటిరోజే

అనుకొంది మంగ..................

  • Title :Katha 2023
  • Author :Vasireddy Naveen
  • Publisher :Katha Sahiti
  • ISBN :MANIMN5680
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :217
  • Language :Telugu
  • Availability :instock