రాజకీయ బేతాళ పంచవింశతిక
రమణగారు సమకాలీన పరిస్థితులపై తన అభిప్రాయాలు వెలువరించడానికి ప్రాచీన సాహిత్యాన్ని బాగా వుపయోగించుకున్నారు. భోజరాజు కథల్లోంచి 'విక్రమా రుని సింహాసనం కథలు' ఐడియా తీసుకున్నారు. కన్యాశుల్కంలోని గిరీశం పాత్ర వుపయోగించుకుని 'గిరీశం లెక్చర్లు' పేర సినిమాల గురించి, సంఘాన్ని గురించి విమర్శించారు. సినిమాలు తీసినపుడు రామాయణ, భారత గాథలను నేటి సమాజా నికి అన్వయించి వాడుకున్నారు. పంచతంత్రం టెక్నిక్కు ఉపయోగించి ఋణానంద లహరి రాశారు. అలాగే రాజకీయాల గురించి వ్యాఖ్యానించడానికి 'బేతాళ పంచ వింశతిక' కథల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు.
బేతాళ కథలు మనందరికీ తెలుసు. విక్రమార్కుని వద్దకు ఓ తాంత్రికుడు వచ్చి తన హెూమానికి సాయం చేయమని అడుగుతాడు. చెట్టుమీదనుండి బేతాళున్ని తీసుకొచ్చి అప్పగించ మంటాడు. కండిషన్ ఏమిటంటే శవాకారంలో వున్న బేతాళున్ని భుజాన వేసుకుని తెచ్చేటప్పుడు మౌనంగా వుండాలి. అయితే బేతాళుడు విక్రమార్కుడిని చిక్కుల్లో పెడతాడు. ఒక కథ చెప్పి, దానికి సంబంధించి ప్రశ్న వేస్తాడు. దానికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే తల వెయ్యి చెక్క అవుతుందంటాడు. ఒక్కో కథ ఒక్కో రిడిల్. చాలా తర్కం వుపయోగించి ఆ సమస్యకు సమాధానం చెప్పవలసి వుంటుంది. ఛట్టున సమాధానం చెప్పలేం.
కానీ విక్రమార్కుడు తెలివైన వాడు| కాబట్టి జవాబు చెప్తాడు. నోరు విప్పాడు. కాబట్టి బేతాళుడు మళ్లీ చెట్టెక్కేస్తాడు. మళ్లీ విక్రమార్కుడు చెట్టెక్కి బేతాళుణ్ని భుజాన వేసుకుని బయలుదేరతాడు. ఇలా చాలా సార్లు అయ్యాక ఆఖరిసారి బేతాళుడు...............