• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Katha Sravanthi K Sabha Kathalu

Katha Sravanthi K Sabha Kathalu By K Sabha

₹ 70

రాయలసీమ నవకథా వైతాళికుడు

పరిశోధకులు రాయలసీమలో తొలికథ 1852లోనే పుట్టిందని నిరూపించినా, అనంతపురం జిల్లాకు చెందిన జి. రామకృష్ణగారు 1941లోనే కథలు రాశారని చాలా కాలం వరకూ ఆయన్నే తొలి రాయలసీమ కథకుడని సంభావించినా, 1944లో ప్రారంభించి 1980లో _మరణించే వరకూ దాదాపు 300 కథలు రాసి, తర్వాత వచ్చిన కథకుల మార్గదర్శకుడైన కె. సభాగారినే తొలి ముఖ్యమైన రాయలసీమ కథకుడుగా గుర్తించాల్సి వుంటుంది.

సభాగారిది బహుముఖీనమైన ప్రతిభ. ఆయన కథలేగాకుండా నవలలు, పిల్లల కథలు, కవిత్వమూ కూడా రాశారు. ఆనాటి యెన్నికల సమయాల్లో బుర్రకథలు కూడా రాశారు. బడిపంతులుగా వొక దశాబ్దంపాటూ పనిచేసి తర్వాత ప్రాతికేయుడిగా మారారు. తానే వొక పత్రికను స్థాపించి నడిపారు.

చిత్తూరు జిల్లాలో కొట్రకోన అనే చిన్న కుగ్రామంలో సాదాసీదా కుటుంబంలో 1923లో పుట్టిన సభాగారికి బీదరికం, రైతుల కష్టాలు, కూలీల అవస్థలు, వృత్తిపని వాళ్ళ కడగండ్లు బాగా తెలుసు. చిన్నతనంలో తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూడా చేశారు. 1947లోనే చిత్తూరుకు దగ్గరిలో శివగిరిలో రైతాంగ విద్యాలయం నిర్వహించారు. పట్టణాలకు వచ్చాక అక్కడి మధ్యతరగతి మనుషుల జీవితాల్ని పట్టించుకున్నారు. తిరువణ్ణామలైకెళ్ళి రమణాశ్రమంలో రమణ మహర్షిని చూశారు. చలంగారితో స్నేహం చేశారు. ఆ తరువాత ఆధ్యాత్మిక రచనలు గూడా రాశారు.

స్వాతంత్య్రానికి ముందున్న గాంధీయిజపు ఆదర్శవాదమూ, స్వాతంత్ర్యం తరువాతి కాలంలో జరిగిన సాంఘిక రాజకీయ పరిణామాలూ సభాగారి కథల్లో స్పష్టంగా కనబడతాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులూ, గ్రామాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, తగ్గిన భూగర్భజలాలూ, వ్యవసాయ అనుసంగిక వృత్తులవారి జీవన సంక్షోభాలూ, సభాగారు రాసిన గ్రామీణ కథలకు వొస్తులయ్యాయి. గ్రామాల్లోని దళితుల కష్టాలూ, ఆడకూలీల యాతనలూ, సారా కల్లు దుఖాణాల ప్రాభవాలూ ఆయన కథల్లో విస్పష్టంగా కనబడతాయి.

రాయలసీమ అన్న పేరే కరువుకు పర్యాయపదంగా మారిపోయింది. వర్షాభావం, నీటి యెద్దడిల గురించి రాసిన కథలకంతా సభాగారి 'పాతాళగంగ' గొప్ప నమూనాగా నిలబడి పోయింది. వ్యవసాయానికి బావిని తవ్వే తండ్రి పట్టుదలనూ, సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే..............

  • Title :Katha Sravanthi K Sabha Kathalu
  • Author :K Sabha
  • Publisher :Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam, Guntur Branch
  • ISBN :MANIMN4154
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock