• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Katha Sravanthi Tallavajjula Patanjali Sastry Kathalu

Katha Sravanthi Tallavajjula Patanjali Sastry Kathalu By Tallavajjula Patanjali Sastry

₹ 70

తెరుచుకున్న కథలు

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారు కవి, కథకులు, నాటకకారులు, నవలా రచయిత, పర్యావరణవేత్త. ఆయన కథలగురించి మాత్రమే మాట్లాడాల్సిన సందర్భంలో కూడా తక్కిన విశేషాలన్నిటినీ ప్రస్తావించుకోవాల్సిందే. ఎందుకంటే అవన్నీ కలిసి ఆయన కథలు తయార కాబట్టి

శాస్త్రిగారి కథల్లో కవి కనిపిస్తాడు. కథల్లో కవిత్వస్పర్శ కనిపించే రచయితలు ఇతరులు కూడా కొందరున్నారు. కానీ శాస్త్రిగారు కవితాశైలిని వాడడంలో ఉద్దేశం భిన్నంగా ఉంటుంది. ఒక సౌందర్యం కోసం, ఒక ఉద్వేగ స్పర్శకోసం ఆ శైలిని వాడుకోరు. కథనంలో చిక్కదనం సాధించడం కోసం వాడతారు. అనుభవ గాఢతని సాధించడంకోసం వాడతారు. అల్లిక జిగిబిగి సాధించడంలో భాగంగా వాడతారు. శాస్త్రిగారి కథాభాష వేరే భాష, దాన్ని ఆయన సాధించారు. ఆ క్రమంలో తెలుగుదనాన్ని ఎక్కడా కోల్పోలేదు.

ఈ కథల్లో నాటక కారుడు కనిపిస్తాడు. సంభాషణలు ఎక్కువ రాస్తారని కాదు. బలమైన, సహజమైన, కథాచాలన సమర్థాలయిన సంభాషణలుంటాయనికూడా కాదు. అవన్నీ ఉంటాయి. దాంతోబాటు నాటకంలోలాగా రచయిత ఎక్కడా చొరబడకపోవడం అనే లక్షణంకూడా చాలా ప్రధానంగా ఉంటుంది. తన ముఖతః చెప్పరు. పాత్రలద్వారా ఉపన్యాసాలిప్పించరు. చెప్పదలుచుకున్న మాట కథ వెనక ఉంటుంది. కథకు నీడలా ఉంటుంది.

పర్యావరణకారుడికి ఉండే ఒక స్పృహ ఆయన కథల్లో చాలాచోట్ల పరుచుకుని ఉంటుంది. కొన్ని కథల్లో ఆ స్పృహే కథ. 'జోగిపంతులు తిరిగి రాలేదు' కథ ఎంత విలక్షణమైన పర్యావరణ కథో! 'ఉర్వి' మరో విశేషమైన కథ.

శాస్త్రిగారు ఇన్నేళ్ళుగానూ రాసిన కథలు ఒక వందవరకూ ఉంటాయి. వీటిల్లో ఆయన సాధించిన వైవిధ్యం అద్భుతం. ఏ రెండు కథలూ ఒకేలా ఉండకూడదని వ్రతం పట్టి రాసినట్టు ఉంటాయి ఆయన కథలు. ఈ సంపుటినే తీసుకుంటే 'జై' కథ గాంధీగారి ఆంధ్రదేశ కుగ్రామ సందర్శన ఇతివృత్తంగా ఉంది. 'రోహిణి' బుద్ధుడి కాలం నాటి కథ. జిర్రున పొలిటికల్ సెటైర్.

  • Title :Katha Sravanthi Tallavajjula Patanjali Sastry Kathalu
  • Author :Tallavajjula Patanjali Sastry
  • Publisher :Tallavajjula Patanjali Sastry
  • ISBN :MANIMN4153
  • Binding :Papar back
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :99
  • Language :Telugu
  • Availability :instock