• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Katha Vedika

Katha Vedika By Katha Gowthami

₹ 100

ఏవూరు కేగినా ...”
 

చట్టి హనుమంతరావు
 

అదో పల్లెటూరు.

ఊరికుండాల్సిన పాలనావ్యవస్థ ప్రెసిడెంట్, మునసబు, కరణాలతో పాటూ ఒక ఖూనీకోరూ, ఎక్స్ మిలిటరీమేన్, ఉన్న రెండు గుళ్ళకీ ఇద్దరు వేర్వేరు పూజార్లూ, చదువు చెప్పడానికన్నట్లు వీధిబడీ, పంతులు గారూ.

రెండు గుళ్ళనీ కలుపుతూ బ్రాహ్మల వీధి. చెరో పక్కా కొంచెం అవతలగా కాపుల ఇళ్ళూ, చిన్నా పెద్దా కేటగిరీలూ వగైరాలు. ఊరికి దక్షిణంగా అమ్మవారిగుడి. గుడికి రెండు ఫర్లాంగుల అవతల దాదాపు డెబ్బయిగుడిసెలతో మూలగా మాలపల్లి. అందులో మాల, మాదిగల ఇళ్ళను వేరు చేస్తూ ఎలక్షను కారు పట్టేంత వెడల్పున్న ఓ మట్టిరోడ్డు. ఊరికి పశ్చిమంగా గోదావరి గట్టు. గట్టు పొడుగునా కులాలవారీ రేవులు. ఊళ్ళో నోరున్న జనాన్ని మించి నోరులేని పశువులు. అన్నట్టావూరికి కరెంటుంది. లైసెన్సు లేనిదొకటి, ఉన్నదొకటీ 'కల్లు' దుకాణాలున్నాయి. వైద్యం చేసేందుకు మందులకొట్టులాంటి దొకటుంది. ఇంకా నాల్గు చిల్లర దుకాణాల్తో పాటూ సూపర్ బజార్ వాళ్ళు పెట్టిన బ్రాంచి పేరు చెప్పి ఓ పెద్ద ఖాళీగదీ, అందులో పద్దులు నింపడానికో మనిషి.

వెలుగును తరుముకొంటూ చీకటి వస్తూంటే వీథిలో వెలుగంతా భయంతో ఏకైక లైటుస్తంభం చివర చేరుకుంటోంది. చీకటి పేట్రేగి పోతున్న అధర్మంలా...........

  • Title :Katha Vedika
  • Author :Katha Gowthami
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN3987
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock