₹ 100
వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని, సాహిత్య బోధనను సాహిత్య అధ్యయనంగా గుర్తించిన అతికొద్ది మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులలోకిన్నెర శ్రీ దేవి గారొకరని నిరూపించే పదకొండు వ్యాసాల సంకలనంయిది. వివిధ సందర్భాల్లో, వేర్వేరు సమయాల్లో కథను గురించి, కధకుల్ని గురించి రాసిన యూ వ్యాసాలు విమర్శకురాలి అభిరుచికి, అనుశీలనాసక్తికి గీటురాళ్ళుగా నిలుస్తాయి.
రచయిత సమగ్ర సాహిత్యపు నేపథ్యంలో, అతడి/ఆమె ప్రాతినిధ్య రచనల్ని గురించి చర్చించగలగాలి. కిన్నెర శ్రీ దేవి ఈ విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నించారు.
సాహిత్య సృజనలా సాహితి విమర్శ కూడా గొప్ప సాధన. ఆ సాధన చేయడానికి కావాల్సిన శక్తియుక్తులన్నీ శ్రీదేవిగారిలో వున్నాయని యూ పుస్తకం వెల్లడి చేస్తోంది. "కధా - సాహిత్య విమర్శలో జరగాల్సినంత కృషి జరగడం లేదు "అన్న అసంతృప్తిని, లోటును " కథ విమర్శనం - విశ్లేషణం " పుస్తకం భర్తీ చేస్తుంది.
-ఆచార్య మధురాంతకం నరేంద్ర.
- Title :Katha Vimarsa Visleshana
- Author :Dr Kinnera Sridevi
- Publisher :Prajashakti Book House
- ISBN :MANIMN0701
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :150
- Language :Telugu
- Availability :instock