• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kathala Samudram

Kathala Samudram By Vandrevu Chinaveerabhadrudu

₹ 250

ద స్టోరీటెల్లింగ్ యానిమల్

మేమంతా ఆత్మీయంగా శేఖరుగారు అంటూ పిలుచుకునే గోటేటి రాజశేఖరరావుగారు నాకు తెలిసినవాళ్ళల్లో గొప్ప భాషావేత్త. అంటే లింగ్విస్టు అని కాదు, ఒకప్పటి భర్తృహరి (సుభాషితాల భర్తృహరికాదు, వాక్యపదీయం రాసిన భర్తృహరి), నిన్నటి విట్ గెన్దేనుల్లాగా భాషాతత్త్వవేత్త అన్నమాట.

ఆయన నాలుగైదు రోజులకిందట ఒక వాక్యం రాసారు. 'కథనం చిత్తమును సంపాదిస్తుంది' అని.

ఆ వాక్యం చాలా intriguing గా ఉండటమే కాకుండా, నన్ను నిద్రలోనూ, మెలకువలోనూ కూడా వెంటాడుతోంది.

మనం మామూలుగా ఏమనుకుంటామంటే, చిత్తం కథనాన్ని అల్లుతుంది అని. కాని కథనం చిత్తాన్ని అల్లుతుంది అంటే ఏమిటి? ఇది మన సమకాలీనుడైన మన మిత్రుడొకాయన రాసిన వాక్యమంటే నమ్మశక్యంగా లేదు. మన భ్రమల్నీ, బంధాల్నీ తాను కూడా మనతో పంచుకుంటూ, మనమధ్యనే తిరుగాడుతున్నా, మానసికంగా ఎంతో విముక్తి సముపార్జించినవాడు గానీ అట్లాంటి వాక్యం రాయలేడు కదా అనిపించింది.

ఇంతకీ చిత్తమంటే ఏమిటి? 'చేతయతీతి చిత్తం' అని అమరం. ఏది ఆలోచిస్తుందో అది చిత్తం. అంతేనా? భారతీయ దర్శనాల్లో చిత్తానికొక ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధులు దాన్ని మనసునుంచి, విజ్ఞానం నుంచీ, అహంకారం నుంచీ వేరుగా చూసారు. చిత్తవృత్తి నిరోధమే యోగమని పతంజలి అన్నాడు.

వృత్తి అంటే మనసులో కలిగే వికృతి. మనమొక పువ్వుని చూస్తే మనసులో ఒక పువ్వు ఆకృతి ఏర్పడుతుంది. అదే ముల్లుని చూస్తే ముల్లు ఆకృతి....................

  • Title :Kathala Samudram
  • Author :Vandrevu Chinaveerabhadrudu
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6373
  • Binding :Papar Back
  • Published Date :July, 2025
  • Number Of Pages :199
  • Language :Telugu
  • Availability :instock