కట్న నిషేధ చట్టము, 1961
(THE DOWRY PROHIBITION ACT, 1961)
(1961లోని 28వ చట్టము, తేదీ 20-5-1961)
కట్నమును ఇచ్చుటను లేక తీసుకొనుటను నిషేధించుటకు చేసిన చట్టము, భారత గణతంత్ర రాజ్యము యొక్క 12వ సంవత్సరంలో పార్లమెంటు ఈ క్రింది విధంగా శాసనం చేసింది :-
(1) ఈ చట్టమును, కట్న నిషేధ చట్టము, 1961 అని పేర్కొనవచ్చును. (2) ఈ చట్టము యావత్ భారతదేశానికి విస్తరించును. '[XXX]. (3) ఈ చట్టము కేంద్ర ప్రభుత్వము అధికార రాజపత్రములో ప్రకటన ద్వారా నియమించు తేదీ" నుండి అమలులోనికి వచ్చును.
వ్యాఖ్య
మన సమాజంలో అత్యంత వేగంగా ఒక అంటువ్యాధిలా వ్యాపించిన కట్నం అనే దురాచారాన్ని నియంత్రించటానికి భారత పార్లమెంటు 1961వ సం॥లో కట్న నిషేధ చట్టాన్ని చేసింది. ఈ చట్టం కట్నం ఇవ్వటాన్ని లేదా కట్నం తీసుకోటాన్ని నిషేధిస్తూ ఆచర్యను విచారణ యోగ్యంకాని అపరాధంగా పరిగణించింది. భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 498A గల 13(A) XXII(A) అనే కొత్త అధ్యాయాన్ని
2.ఎస్.ఒ. 1410 తేదీ 20-6-1961 ద్వారా తేదీ 1-7-1961 నుండి అమలులోకి ఉండును.