అడివి బాపిరాజు
అడివి బాపిరాజు అక్టోబరు 8, 1896న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు.
1922లో రాజమహేంద్రవరంలో బి.ఏ. పూర్తి చేశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోద కుమార చట్టోపాధ్యాయ వద్ద చిత్రలేఖనం నేర్చుకున్నారు. మద్రాసులో బి.ఎల్.
చేశారు.
తర్వాత బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా పనిచేశారు.
మీజాన్ పత్రిక సంపాదకునిగా, విజయవాడ రేడియో కేంద్రం సలహాదారునిగా పనిచేశారు.
భీమవరంలో లాయరుగా ప్రాక్టీసు చేశారు.
ఆయన రచనల్లో ముఖ్యమైనవి 'నారాయణరావు', 'తుఫాను', 'గోనగన్నారెడ్డి', 'కోనంగి', 'హిమబిందు', 'నరుడు', 'జాజిమల్లి'.
బాలల నాటకాలు, కథలు కూడా రాశారు.
1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలా రచన పోటీలో విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'వేయిపడగలు' నవలతోపాటు, 'నారాయణరావు' నవలకు సంయుక్తంగా పురస్కారం లభించింది.
నవ్య సాహిత్య పరిషత్తు వ్యవస్థాపకుల్లో బాపిరాజు ఒకరు. ఆయన కళా దర్శకత్వం వహించిన సినిమాలు 'మీరాబాయి', 'అనసూయ', 'ధృవ విజయం', 'పల్నాటి యుద్ధం',
బాపిరాజు పాటల సంపుటి 'శశికళ'.
అడివి బాపిరాజు సెప్టెంబరు 22, 1952 నాడు మరణించారు.
1999లో 'ఆంధ్రజ్యోతి' నిర్వహించిన సర్వేలో 'నారాయణరావు' నవల అత్యంత ప్రభావితం చేసిన 100 తెలుగు పుస్తకాల్లో 55వ స్థానం పొందింది...............