₹ 100
కవితని వెదుకుతూ కదిలింది నా కలం
కవితని వెదుకుతూ కదిలింది నా కలం... ఉహల కొండలెన్నో ఎక్కింది
పేదవాడి గుండె తలుపు తట్టింది
పచ్చని పైరుగాలులతో కలిసి ఈలలేసింది
పరికిణి అందాలను వర్ణిస్తూ గోలచేసింది
సెలయేళ్ళ ప్రవాహాలతో కలిసి పరుగులెత్తింది
అర్ధరాత్రి రోడ్డు పక్కన నడుస్తూ ఆకలి కేకలు విన్నది
అవసరాల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న వేశ్యల చిరునవ్వు వెనుక దాగున్న కనీటీ గాధను కన్నది
రాత్రివేళ నల్లని ముసుగులో ఈ దేశాన్ని దోచుకుంటున్న దొంగను చూసింది
తెల్లవారగానే తెల్లపంచె కట్టిన అదే దొంగోడు దేశమేలుతుంటే ఆశ్చర్యపోయింది.
- Title :Kavi Sedyam
- Author :Putrevu Saicharan
- Publisher :Torchbearer Publications
- ISBN :MANIMN1059
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :62
- Language :Telugu
- Availability :instock