• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kavi Yakoob

Kavi Yakoob By Vamsi Krishna Gudipati

₹ 700

నెబులా

నక్షత్రాలుగా పొదిగే ప్రదేశం- కవిసం'

నగ్నముని

నేటి కవిత్వం
తన చరిత్రను
కవి యాకూబ్తో
రాయించుకుంటోంది

కవులకీ కార్చిచ్చులకీ అంగార సంబంధం వుంది.
కవులకీ, నక్షత్రాలకీ మార్మిక సంబంధం వుంది,
ఈ నిగూఢ అనుబంధం గురించి మరోసారి చెబుతాను.

...

ముందుగా, ఓ ముఖ్యమైన, వ్యక్తిగతమైన విషయం చెప్పాలి.

కవి యాకూబ్ పై నాకు మొదట్నుంచీ ప్రత్యేకమైన అభిమానం వుంది. అది లౌక్యమైనది కాది. సహజమైనది, గాఢమైనది.

కొన్ని కారణాలు చెబుతాను.

అతను స్వయంగా చక్కని, చిక్కని కవిత్వం రాస్తూనే, యితరులతో, అంతే అభినివేశంతో రాయిస్తున్నందుకు బతుకు పోరాటంలో, కనబడని రక్తసిక్త ఆటుపోట్లను తట్టుకుంటూ, యోధగా నిలిచి, వెన్ను చూపకుండా సాగిపోతున్నందుకు-

కళాశాల చదువుల్లో- పిజి తర్వాత - విమర్శనా రంగానికే పేరు తెచ్చిన మల్లు రాచమల్లు రామచంద్రారెడ్డిగారి రచనలపై ఎంఫిల్ చేశాడని తెలియగానే- ఆనందం అంచులు దాటింది. అందువల్ల అంతకుముందు వున్న అభిమానం పెరిగి ప్రత్యేక అభిమానంగా మారింది.

రారా రచనలు కఠోరాలు, విమర్శను పెన్నుతో కాదు, కత్తితో రాసేవాడు. తట్టుకోవడం కష్టం. నా దిగంబర కవితోద్యమాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నేను కోపం తెచ్చుకోలేదు. గాభరాపడలేదు. కసి పెంచుకోలేదు. ఆహ్వానించాను. ఆనందించాను. పైగా, ఆ విమర్శను పక్కనపెట్టి ఆయనను మరింత ఎక్కవగా గౌరవించాను.

ఇది జరిగిన కొన్నాళ్ళకు - మేం కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు- దిగంబర కవితోద్యమంపై ఆయన విమర్శలో లేవనెత్తిన అంశాలకు ముఖతా వివరంగా సమాధానం చెప్పాను. ప్రశాంతంగా చెప్పాను. ఆయన ఆలోచనలో పడ్డాడు..................

  • Title :Kavi Yakoob
  • Author :Vamsi Krishna Gudipati
  • Publisher :Kavi Yakoob@60 commitee
  • ISBN :MANIMN3848
  • Binding :Paerback
  • Published Date :March, 2021
  • Number Of Pages :738
  • Language :Telugu
  • Availability :instock