అంతర్ జ్వాల
ఇది అంతర్
మనిషనే అగ్గిపుల్లని
ఏ రోడ్డు మీద గీసినా భగ్గున మండే
సమాజ బాధామయ వాతావరణం
గుండెలో రాజుకుంటున్న మహాజ్వాల
పెద్ద పెద్ద ఇనప్పెట్టెల్లో
కన్నీళ్ళూ
చిన్న కార్ల టైర్ల అడుగున
గుండె కాయలూ
ఎయిర్ కండిషన్ మేడల పునాదుల్లో
స్వేద ప్రవాహాలూ
బంగారు గుమ్మాల మీద కుంకుమబొట్లలో
నెత్తురు జీరలూ
విందుభోజనాల విస్తళ్ళకింద
ఆకటి చావులూ
తాగి తాగి తూలే వాళ్ళ అరికాళ్ళ కింద
సన్నని అరుపులూ
రాజకీయ కత్తి అంచుల పొడుగునా
నిండు బ్రతుకులూ.....................