₹ 150
పాఠకుడు కవిని తొలి పంక్తిలోనే పసిగడతాడు. కవిత హృదయగాతమా లేకుంటే పెదవుల మీద పొడి పొడి పదాల సముచ్ఛయమా అనేది గుర్తిస్తాడు. కవి ఆంతర్యసంలోని విశాలతని లేదా గానుగెద్దు నడక వంటి వృత్తకారపు వేసటని పోల్చుకొంటాడు. ఊహలలో సైతం లోభిత్వo, క్లుప్తత ఎరుగని వాగుడు, బాహ్య విషయాలని దాటని అంతర్దృష్టి మాంద్యం, పత్రిక భాషనీ అధిగమించలేని పదజాలపు లేమి ఇత్యాది మౌలికాంశాలను గమనిస్తాడు. రచనకి ఆచరణకి సామ్యం లేని అతని జీవితంలోంచి పలికే ప్రభోదంతో విసిగి పోతడు. కవి గాలివాటానికి కొట్టుకొని పోతున్నాడా, అచంచల దీపస్తంభం లాగ కాంతులీనుతున్నాడా అని యేచిస్తాడు. అతని అధ్యయనం లోతేమిటో, సంయమనం ఏపాటిదో కూడ తేరిపార చూస్తాడు.
-గిరిధర్ అరసవెల్లి.
- Title :Kavitha- 2018
- Author :Giridhar Arasavelli
- Publisher :Sahithi Mitrulu
- ISBN :MANIMN0676
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :174
- Language :Telugu
- Availability :instock