కలల రొట్టె
గతరాత్రి
కలల రొట్టె తినడానికి సాహసించాను
అయితే ఈ విషయం
ఆకాశందాకా ఎలా వెళ్లిందో నాకు తెలీదు
పెద్దరెక్కలు ఈ వార్త విన్నాయి.
పొడుగుముక్కులు ఈ వార్త విన్నాయి
క్రూరదంతాలు ఈ వార్త విన్నాయి.
పదునుగోళ్లు ఈ వార్త విన్నాయి
రొట్టె నగ్నం
దాని వాసన నగ్నం
దానికి ఆత్మముసుగూ లేదు.
మాంసపు ముసుగూ లేదు.
ఒక్కసారిగా అవి రొట్టెను తన్నుకుపోయాయి
నా చేతులు చీరుకుపోయాయి
నా చెక్కిళ్లు గాయాలయ్యాయి................