కుమార సూర్యనారాయణ గాత్ర సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు, గాయకులు, విజయవాడ.
మానవ జీవితం సంగీత, లయల మిళితం. సంగీతము లేని మాట లేదు, ఆట లేదు. ఏ భాషైనా సంగీత మిళితమే. ఆ భాష మాట్లాడుట సంగీతముతోనే, ఏదో ఒక స్వరనాదముపై ఆధారపడి ఉంటుంది మానవుడి నోటిమాట. మానవుడు చేసే ప్రతిక్రియకు లయ ఉంటుంది. లయ ప్రకారము చేయకపోతే ఆక్రియ సఫలీకృతం కానేరదు. కనుక మానవ జీవితానికి ఆధారము సంగీతము మరియు లయ. ముఖ్యంగా భారతీయ సంగీతము దక్షిణాన కర్ణాటక సంగీతము. ఉత్తర భారతాన హిందూస్థానీ సంగీతం విరివిగా సాగుతున్నాయి. శాస్త్రబద్దంగా నియమ బద్దంగా కర్ణాటక సంగీతం మాత్రమే సంస్కరింపబడింది. పూజ్యులు వెంకట మల్ పురందరదాసు తదితరులు సంగీతానికి ఒక సుపధమేర్పరచారు. సంగీతానికి ఆకర్షితుడ కానివాడు క్రూర జంతువుతో పోల్చబడినాడు. సంగీతము ఆస్వాదించువాడు సౌమ్యుడు జీవిస్తాడు. సాటివారిని ఆదరిస్తాడు. శాంతి సౌభ్రాతృత్వాలతో వెల్లివిరుస్తాడు. ప్రస్తు సమయంలో చెప్పవలసిన ముఖ్య విషయం “గురువు లేకుండా సంగీతం నేర్చుకోవడం బ: కష్టం" అటువంటి పరిస్థితులేర్పడిన ప్రదేశాలలో సంగీతం అభ్యసించడానికి ఒక సులువై సులభమైన మార్గానుసరణబోధినిని అందించడానికి విరివిగా కృషిచేసిన శ్రీ మానంది ప్రక గారు అభినందనీయులు. ఆ పుస్తకమే అపర సరస్వతియై ఒక సద్గురువుగా వ్యవహరింప
సంగీతం బోధిస్తుంది అనుటలో ఏమాత్రం సందేహం లేదు. సంగీతమంటే “సరిగమ దని” అనే ఏడు స్వరాలే కదా అనుకుంటే పొరపాటే! ఆ ఏడు స్వరాలు 7+7 పదునాల లోకాలను ఏలుతున్నాయి. “సప్త స్వర సమన్విత సంగ్రహం” గా ఈ పుస్తకము సర్వులకు పయాగకారీ