₹ 100
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యడు ఒక్కడే. కానీ నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి.
మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశి మనుగడ లేదు. అసలు సూర్యుడు లేకపోతే రాత్రి, పగలూ లేవు. జంతువులూ, పక్షులూ ఉండవు. కాలగమనమూ లేదు. ఆ జ్ఞానంతోటే రోజులు, వారాలు, నెలలూ, సంవత్సరాలు వచ్చాయి కదా. అదే విధంగా చంద్రుడు, గ్రహాలు నక్షత్రాలు ఈ జగన్నాటకంలో పాత్రధారులు అనే దృఢ నిశ్చయానికి వచ్చాడు మానవుడు. మొత్తానికి మానవుడు ఎంత మేధాని అయినా ఈ విశ్వదేహాల ఉనికిలో మనం అల్పులమే అని గ్రహించుకొన్నాడు. ఏమైనా అంతరిక్షంలోనక్షత్రాలు అద్భుత భ్రాంతిని కలుగజేస్తాయి. మనం ఒకరి నొకరి మీద వీక్షణాలని ప్రసరించుకొనే బదులు అందరి దృష్టి వాటి మీదకి సారించి వాటి రహస్యాలను చేధించాలి కదా!
- Title :Khagolasastramu- Dani Charitra
- Author :Jammi Konetirao
- Publisher :Navachetana Publishing House
- ISBN :MANIMN2331
- Binding :Paerback
- Published Date :2015
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock