నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స
ఎనిమిదో నిపాతం
1. కచ్చాని జాతకం (417)
"ఓదాతవత్థా సుచి అల్లకేసా ..." ఇది శాస్త్ర జేతవనంలో ఉన్నప్పుడు తల్లికి సేవచేసే ఒకానొక ఉపాసకుని గురించి చెప్పిన గాథ.
వర్తమాన కథ
శ్రావస్తి నగరంలో ఒక యువ ఉపాసకుడున్నాడు. ఎంతో శీల సంపన్నుడు. తండ్రి మరణించాక, తన తల్లి బాధ్యతలన్నీ అతగాడే చూస్తున్నాడు. తల్లిని దేవతగా ఎంచి సకల సపర్యలూ చేస్తున్నాడు. ఉదయాన్నే ముఖం కడుక్కోడానికి నీరు అందించేవాడు. పళ్ళు తోముకోడానికి కావలసిన వన్నీ సమకూర్చేవాడు. స్నానానికి కావలసిన నీరు సిద్ధం చేసేవాడు. ఆమెకు అతనే స్నానం చేయించేవాడు. ఆ తర్వాత ఆమె త్రాగడానికి జావను కాచి, ఇచ్చేవాడు.
కొడుకు చేస్తున్న సపర్యలన్నీ చూసీ, చూసీ ఆమె ఒకనాడు -
"నాయనా! ఈ పనులే కాదు. నీవు చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటి ఉంది. మంచి కుటుంబానికి చెందిన ఉత్తమ కన్యను వివాహం చేసుకోవాలి. ఆమె నాకు సేవ చేస్తుంది. అప్పుడు నీవు చేయాల్సిన పనుల్ని నీవు చేసుకోవచ్చు" అంది.
ఎలా చేస్తారు?"
"అమ్మా! నేను నీ మంచికోరేవాణ్ణి కాబట్టి నీకు సేవలు చేస్తున్నాను. వేరే వాళ్ళు నాలా
"సేవల కోసమే కాదు నాయనా! మన వంశం నిలబడాలి. అందుకోసమైనా నీవు. వివాహం చేసుకోవాలి".......