మానవీయ కథకుడు గఫార్
సయ్యద్ గఫార్ నాకు మొదటిసారి నా చిరకాల మిత్రుడు యం.డి. అబ్దుల్లా (సురక్ష, పోలీసు పత్రిక మేనేజింగ్ ఎడిటర్) గారి దగ్గర కలిశాడు. అబ్దుల్లా, నేను "అపరాధ పరిశోధన" పత్రికలో కథలూ, నవలికలూ రాస్తూండేవాళ్ళం. చానాళ్ళ తర్వాత మిత్రుడు అబ్దుల్లాను కలిసి వెళ్లామని "సురక్ష" పత్రిక ఆఫీసుకొచ్చాను. అక్కడ ఉన్న గఫార్ ను పరిచయం చేస్తూ "ఇతను నా చిరకాల మిత్రుడు గఫార్, అని మంచి కవి" అని పరిచయం చేశాడు. పరస్పర కరచాలనాల తర్వాత, గఫార్ అప్పుడు నాకు తన కవితా సంపుటి "జనన వాంగ్మూలం" ఇచ్చాడు. ఖాదర్ మొయినొద్దీన్ "పుట్టుమచ్చ" తర్వాత అంత శక్తి గల కవిత్వం అన్పించింది. అప్పటికే "ఆంధ్రభూమి" దిన పత్రికలో, తన కథలు కొన్ని అచ్చయ్యాయని, ఈ కథల సంపుటి చదివాక తెలిసింది నాకు.
అప్పుడే తెలంగాణావారి కోసం నవలల పోటీ పెట్టారు. ముస్లిం జీవితాల మీద మంచి నవల రాయండని గఫార్ కు సూచించాను. తప్పకుండా ఆ ప్రయత్నం. చేస్తానన్నాడు. గనీ మరో సందర్భంలో కలిసినప్పుడు కుదరలేదన్నాడు. తను మిర్యాలగూడ- హైద్రాబాద్లో మద్య తిరుగుతున్నాడు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కలుసుకున్నాం. కొంత కాలానికి తను హఫీజ్ పేటకు చేరుకున్నాక మా మధ్య స్నేహం బలపడింది. నువ్వు కథల మీద దృష్టి పెట్టాలి మిత్రమా అని బలవంతం చేశాను.....................................