• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kiranam

Kiranam By P V R Shiva Kumar

₹ 200

ఇరుకు

నేను ఆ గదిలో చేరి నెల రోజులు దాటుతోంది. నాన్నగారు ఈ వూరినించి వెళ్ళి నెలరోజులే అయింది. నాన్నగారికి ట్రాన్సఫరవడం మూలాన్నే నేను గది వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. మొదట అమ్మని నాతో వుంచి నాన్నగారొక్కరే వెళ్తానన్నారు. కానీ ఈ వయసులో ఆయన్ని హెూటళ్ళ పాలు చేయటం మంచిది కాదనిపించింది! ఆ తంటాలేవో నేను పడటమే ఉచితం అనుకున్నాక అదేమాట ఆయనకి, అమ్మకి సర్దిచెప్పి గదుల వేటలో పడ్డాను. వేట అంటే మళ్ళీ అంతగా శ్రమపడింది లేదు. గది కావాలని నలుగురు స్నేహితులతోనూ చెప్పాను. ఆ మాట వింటూనే మురారి సంతోషపడ్డట్టు కనిపించాడు.

"నువొక్కడివే కదూ! మా ఇంట్లోనే వుందువు గాని" అనేశాడు. స్నేహాన్ని స్వార్థానికి వాడుకోవటం నాకిష్టం లేదు. అదే అన్నాను మురారి తోనూ! అతను ఒప్పుకోలేదు.

"ఛ.. ఛ... ఇందులో నీ స్వార్ధమేం లేదు, ఆ మాటకి వస్తే నా స్వార్థమే వుంది. ఎలాగూ మా పోర్షన్లో ఒక గది అద్దెకివాలన్న ఆలోచన ఈ మధ్యే వచ్చింది. అయితే ఫామిలీలో కలిసిపోయినట్టుండే మనిషి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాను. అదృష్టం కొద్దీ నీకూ అవసరం అయింది. నువ్వు ఆ గదిలో వుంటే నాకు పరాయి వాళ్ళు వున్నట్టుగానూ అనిపించదు. భోజనం మా ఇంట్లోనే చేద్దువుగాని, పేయింగ్ గెస్ట్ గానేలే..." అంటూ నవ్వాడు మురారి

హైస్కూల్లో నాకు మూడేళ్లు సీనియర్ మురారి. నేను కాలేజీకి వచ్చేసరికి అతనీ ఉద్యోగంలో చేరాడు. అనుకోకుండా నాకూ ఇక్కడే ఉద్యోగం దొరికింది. చిన్నప్పటి పరిచయాన స్నేహమూ బలపడింది. అదే మా ఇద్దరి అనుబంధం. అయితే తేడా ఒకటి మురికి పెళ్ళయింది. నాలుగయిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. నాకింకా అర్ధాంగిని ఎన్నుకోవటమే తీరలేదు...................

  • Title :Kiranam
  • Author :P V R Shiva Kumar
  • Publisher :Pala Pitta Books Hyd
  • ISBN :MANIMN4555
  • Binding :Papar back
  • Published Date :Dec, 2019 First Edition
  • Number Of Pages :212
  • Language :Telugu
  • Availability :instock