అద్భుతమైనది ఈ మహాసృష్టి. ఇందులో కోటి జీవరాశులున్నా మానవ జీవితం మహోన్నతమైనది. అలాంటి మానవ జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి మనిషీ చాలా గొప్పవాడు. కానీ .... కొంత మంది మాత్రమే గొప్పవారిగా రాణిస్తున్నారు!
పుట్టినపుడు అందరూ సమానమే... కానీ జీవనశైలి వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి గొప్పవాడు కావడానికి ..... జీవితాన్ని పరిపూర్ణత చేసుకోవడానికి .. మన పూర్వ మహర్షులు వందేళ్ళ మానవ జీవితాన్ని బాగా అధ్యయనం చేసి, ఎన్నో రకాలుగా ఆలోచించి, మనిషి-మనస్సుకు వుండే అవినాభావ సంబంధం ఏమిటనే తత్వాన్ని గ్రహించి మానవులందరి జీవన శైలిని 'ధర్మార్ధకామాలు'గా మూడు ముక్కల్లో ఎన్నో అర్ధాలను విశ్లేషించి చెప్పారు..........