సెన్సే - నేను
అతనిని నేను ఇంకో పేరుతో ఎన్నడూ పిలవలేదు. అందుచేత అసలు పేరు ఎత్తకుండా ' సెన్సే' అనే పేర్కొంటాను. మొట్టమొదటిసారిగా మేము కమలారాలో కలుసుకున్నాము. అప్పటికింకా నేను చదువుకుంటున్నాను. సెలవులు. కొద్దిరోజులపాటు ఒక స్నేహితునితో గడుపుదామని కమలారా వెళ్ళాను. మూడురోజులు గడిచాయో లేదో వెంటనే ఇంటికి బయలుదేరి రమ్మని నా స్నేహితునికి తల్లి దగ్గర నుంచి తంతివార్త వచ్చింది. అతను వెళ్ళాడు. నేను ఒక్కడినే కమలారాలో దిగబడిపోయాను. కాని సెలవులు పూర్తి అయ్యేవరకు మేము బసచేసిన ఇంటిలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను.......................