• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kolimi
₹ 60

గ్రామీణ జీవన యధార్ధతలు “కొలిమి" కథలు

మేరెడ్డి యాదగిరి రెడ్డి తనకు తెలిసిన తను చూసిన జీవితాలను చిత్రించాడు. ప్రత్యక్షంగా రచయిత తను చూసిన ప్రపంచాన్ని చిత్రించటం వ్యాఖ్యానించటం కథకుండే ప్రధాన లక్షణం. ఉహాకల్పనకు ఆధునిక ప్రక్రియ "కథ"లో తావు లేదు. యదార్ధ జీవితం యధార్ధ సంఘటనలకు కళారూపమె కధ. మేరెడ్డికి తన చుట్టూ వున్న జీవితాన్ని బాగా పరిశీలించే గుణం వుంది. ఆ పరిశీలనలో ఎక్కడో అతని మెదడు హృదయం అలజడులపాలయ్యాయి. ఆ అలజడుల ప్రతిధ్వనులే "కొలిమి" కథలు. మేరెడ్డి తను ప్రతినిత్యం దర్శించే విధ్యారంగంలో, వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభాలను ఈ కథల్లో చిత్రించాడు. ఆయన కథలకు నేపథ్యం గ్రామీణ జీవితంలో పాఠశాలలు పనిచేసే తీరులు వ్యవసాయరంగంలో ఏర్పడుతున్న మార్పులు ఆయన కథలకు వస్తువులు.

మేరెడ్డి స్వయంగా ఒక ఉపాధ్యాయుడు. కాబట్టి తను గ్రామాల్లోని పాఠశాల ల్లోని విద్యార్థుల బాధలు ఉపాధ్యాయుల పట్లను వివిధ కోణాల నుంచి చిత్రించాడు. గ్రామాల్లో అందరికి విద్య అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం వుంది. బాలకార్మిక వ్యవస్థను తొలగించి బాలలందరికి విద్య అందించాలని ప్రయత్నాలు చేస్తున్నది. అటువంటప్పుడు. ఇందిర అనే విద్యార్థిని స్కూలు నుంచి "డ్రాపౌటు" కావటంతో పాఠశాలలోని టీచర్లు ఆందోళనపడ్డారు. హెడ్మాస్టరు శివరాజు ఇందిర ఇంటికి పోయి ఆ అమ్మాయి పాఠశాలకు రాకపోవటానికి కారణమేమిటో విచారిస్తాడు. ఆ అమ్మాయి పాఠశాలకు రావాలని తల్లిని సమాధానపరుస్తాడు. చదువంటే ఇష్టమున్న ఇందిర పాఠశాలకు ఆబ్సెంట్ అయిన రోజుల్లో తను కూలికిపోయి సంపాదించిన డబ్బుతో పుస్తకాలను స్కూలు బ్యాగు పెన్సిల్ పెన్నులు కొనుక్కుంటానని పుస్తకంలో దాచుకుంటుంది. ఆ రాత్రి సారాతాగుడుకు అలవాటుపడిన తండ్రివచ్చి ఇందిర డబ్బును ఎత్తుకపోతాడు. తెల్లవారి స్కూలుకు పోవాలని ఇందిర పుస్తకం దులిపితే డబ్బు వుండదు. ఆ డబ్బు ఎవరు ఎత్తుకపోయారో తల్లి.............

  • Title :Kolimi
  • Author :Mayreddy Yadagiri Reddy
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN5385
  • Binding :Papar back
  • Published Date :2010
  • Number Of Pages :138
  • Language :Telugu
  • Availability :instock