అర్బన్ దుకాణం
కలప దుకాణంలో ఈరోజు
ఒక పెద్ద దుంగ కనిపించింది
అది నిటారుగా ముడుచుకుని
దిగాలుగా పడుకున్న
ఆదివాసీలా అనిపించింది
ఇంకెప్పుడూ అటువైపుగా
వెళ్ళకూడదు అనుకున్నాను
అలా వెళ్ళినప్పుడల్లా
ఏదో కుక్కపిల్ల వెంటపడి వచ్చినట్టు
ఒక అడవి నాతోపాటు
మా ఇంట్లోకి వచ్చేస్తుంది
అసలే మా ఇల్లు చిన్నది
అడవి కూడా ఇంత
చిన్నదైపోయిందేమో...................