• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kommireddy Kesava Reddy

Kommireddy Kesava Reddy By Upputuri Rajashekar Rao

₹ 100

అక్షర సేనాని అతడు

కెఎస్ లక్ష్మణరావు, కృష్ణా, గుంటూరు జిల్లాల

పట్టభద్రుల ఎమ్మెల్సీ

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జన్మించిన కె.కేశవరెడ్డి ఒక అక్షరసేనాని. తన రచనలతో, అనువాదాలతో, పుస్తకాలతో ప్రజల్లో ప్రత్యేకించి మధ్య తరగతిలో ప్రగతిశీల భావాలు వ్యాప్తి చెందడానికి జీవితాంతం కృషి చేశారు. గణిత ఉపాధ్యాయుడిగా పని చేసిన ప్రతి చోట పిల్లలు, తల్లిదండ్రుల అభిమానం పొందారు. యుటిఎఫ్ లో చురుకుగా పని చేసి యుటిఎఫ్ నినాదాలైన 'అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ' పూర్తిగా అమలు చేశారు. ఆ సంఘ పత్రిక ఐక్య ఉపాధ్యాయకు 10 ఏళ్లకు పైగా సంపాదకునిగా వ్యవహరించి, అనేక నూతన శీర్షికలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా సాహితీ స్రవంతి సంస్థలో ఉత్సాహంగా పనిచేశారు. అనేక మంది సాహితీవేత్తలతో ఉమ్మడి సాహితీ సభలకు కృషి చేశారు.

కేశవరెడ్డి రచయితగా అనేక పుస్తకాలు రచించారు. వీటిలో అతి ముఖ్యమైనది భారతదేశ విద్యాచరిత్ర. ప్రాచీనకాలం నుంచి నేటి వరకూ విద్యావ్యవస్థ పరిణామాన్ని వివరించిన ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని భారతదేశ విద్యపై విశ్లేషణాత్మక, వర్గ దృక్పథంతో కేశవరెడ్డి రచించారు. భారతదేశ విద్యపై పిహెచ్ఐ అనే స్థాయిలో కృషి చేసి రూపొందించారు. ప్రాచీన కాలం నుంచి 1947 వరకూ మొదటి భాగంలో, 1947 నుంచి నేటి వరకూ రెండో భాగంలో విశ్లేషించారు. ముఖ్యంగా రెండో భాగంలో విద్యా కమిషన్లు, లక్ష్యాలు, విద్య ఆర్థిక, రాజకీయ మార్పులు, మహిళా విద్య, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విద్యారంగ మార్పులు, నూతన సహస్రాబ్దంలో విద్య మొదలైన అంశాలను ఎంతో అద్భుతంగా వివరించారు. కేశవరెడ్డి అనువాదకుడిగా విశిష్ట కృషి చేశారు. 1980లో తొలి అనువాదం గోర్కీ రాసిన 'ది సిటీ ఆఫ్ ఎల్లో డెవిల్' పుస్తకాన్ని 'నగరం' పేరుతో ప్రారంభమై, ఆయన మరణించే వరకూ దాదాపు 30కు పైగా పుస్తకాలను తెలుగులోకి అనువదించడం.............................

  • Title :Kommireddy Kesava Reddy
  • Author :Upputuri Rajashekar Rao
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN5930
  • Binding :Paerback
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :95
  • Language :Telugu
  • Availability :instock