న్యాయవాదం
దయం పెందరాళే భోజనం చేసి కోర్టుకి వెళదామను కుంటూండగా 'ఒక్కసారి పెరట్లోకి రండీ' అంది నా భార్య సులోచన. ఎందుకని ప్రశ్నించకుండానే వెళ్లాను. కోర్టుకి టైమవుతోంది. బయట నా అసిస్టెంటు లాయర్లు నాకోసం ఎదురుచూస్తున్నారు.
పెరట్లోకి వెళ్లగానే అక్కడ కారునలుపులో ఉన్న ఒక ముసలావిడ కనిపించింది. బాగా ఏడిచినట్టుందేమో కళ్లన్నీ ఉ బ్బినట్లున్నాయి. ముడతలుపడ్డ మొహంలో కంటి కింద చారికలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందెక్కడో చూసినట్లుగా వుంది. వెంటనే గుర్తుకు రాలేదు.
నన్ను చూడగానే ఏడవడం మొదలుపెట్టింది. నాకేం అర్ధం కాలేదు. ఇది చూసి సులోచనే చెప్పింది. "ఈవిడ మన మన రైతు పనసయ్య అక్కట. సత్తిరాజుగారి కేసు విషయమై మాట్లాడాలని వచ్చింది..........